7th Pay Commission : ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 3 శాతం డీఏ పెంచుతూ ప్రకటన
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల 4 శాతం డీఏ పెరిగిన విషయం తెలిసిందే. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏ పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న 2.15 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 1.90 లక్షల పెన్షనర్ల కోసం డీఏను 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఉన్న 31 శాతం డీఏ 3 శాతం పెరగడంతో ఆ డీఏ కాస్త 34 శాతంగా మారింది. పెరిగిన 3 శాతం డీఏ వల్ల హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి అదనంగా రూ.500 కోట్ల భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే.. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు సార్లు అంటే జనవరి, జులైలో డీఏ, డీఆర్ ను సవరిస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవలే డీఏ పెరిగింది. 4 శాతం డీఏ పెరిగింది. పెరిగిన డీఏ.. జనవరి 1, 2023 నుంచి అమలులోకి వస్తుందని కేంద్రం తెలిపింది.
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి పెరగనున్న డీఏ
అంటే.. జనవరి 1 నుంచి డీఏ బకాయిలు ఏప్రిల్ జీతంలో జమకానున్నాయి. అయితే.. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో 4 శాతం డీఏ.. ఈసంవత్సరం జులైలో పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక.. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.. డీఏ పెంపుతో పాటు 18 ఏళ్లు పైబడి స్పిటి ప్రాంతాల్లో నివసించే మహిళలకు నెలకు రూ.1500 ఉచితంగా అందిస్తున్నట్టు హిమాచల్ ప్రభుత్వం ప్రకటించింది. దీని వల్ల.. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న 9 వేల మంది మహిళలకు లబ్ది చేకూరనుంది.