7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం తాజా అప్డేట్.. 4 శాతం డీఏ పెంపు, 18 నెలల బకాయిలు త్వరలోనే..!
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. డీఏకి సంబంధించి కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రెండుసార్లు డీఏ పెంచుతుంది. జనవరిలో ఓసారి, జూలైలో మరోసారి డీఏ పెరుగుతుంది. జూలై 1న డీఏ పెరుగుతుందని ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూశారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. డీఏ పెంచడంతో పాటు బకాయిలపై కేంద్ర మంత్రివర్గం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
గుడ్ న్యూస్..
డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ) పెంపుపై అధికారిక ప్రకటన వచ్చే నెలలోగా కేంద్రం చేయనుందని సమాచారం. డీఏ పెంపుపై కేంద్రం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు శాతాన్ని నిర్ణయించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఏఐసీపీ ఇండెక్స్ కనీసం 4 శాతం పెంచవచ్చని సూచించింది.దీంతో ఉద్యోగులకి డీఏ శాతాన్ని 34 నుంచి 38 శాతానికి పెంచుతున్నారు. దీనికి సంబంధించి త్వరలో ప్రకటన రానుంది. జనవరి 1, 2022 నుండి ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం కింద డీఏ పెంపు అమలు చేయబడుతుందని సమాచారం. కనీస బేసిక్ జీతం కోసం 8,640 రూపాయల వార్షిక పెంపును ఆశించవచ్చు.
రూ.18,000 బేసిక్ జీతం కోసం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ప్రస్తుతం 34 శాతం ఆధారంగా నెలకు రూ.6120 డీఏగా పొందుతున్నారు. పెంపు నిర్ణయంతో వారి జీతం మొత్తం నెలకు రూ.6,840 అవుతుంది. అంటే నెలవారీ డీఏ రూ.720 పెంపు, ఏడాదికి రూ.8,640కి పెరుగుతున్నట్టు లెక్క. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ప్రతి ఏటా రెండుసార్లు సవరిస్తారు . డీఏ మరియు డీఆర్ సవరణలు తరచుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద జీతాలు పెంచేలా చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో దాదాపు రెండు లక్షల రూపాయల బకాయిలు అందనున్నట్టు తెలుస్తుంది.