7th Pay Commission : వాళ్లకు జీతాలు పెంచిన ప్రభుత్వం.. ఆగష్టు 1 నుంచి పెంచిన జీతాలే..!
ప్రధానాంశాలు:
7th Pay Commission : వాళ్లకు జీతాలు పెంచిన ప్రభుత్వం.. ఆగష్టు 1 నుంచి పెంచిన జీతాలే..!
7th Pay Commission : ప్రభుత్వాలు కొలువు తీరిన టైం లో ప్రజా పాలన తో పాటుగా ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థిని కూడా అర్ధం చేసుకుని వారికి జీతాలు పెంచే పనుల్లో ఉన్నారు. కర్ణాటకలో ఎప్పుడెప్పుడు జీతాలు పెరుగుతాయా అని ఎదురుచూస్తున్న ఉద్యోగులకు కీలక అప్డేట్ వచింది. కర్ణాటక ప్రభుత్వం 7వ వేతన సంఘం సిఫార్సులను ఆగష్టు 1 నుంచి అమలు చేయాలని కేబినేట్ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెంచిన వేతనాలు నెక్స్ట్ మంత్ 1 నుంచే అందుబాటులోకి రానున్నాయి.దీని ద్వారా దాదాపు 7 లక్షల మందికి పైగా లబ్ధి పొందుతారని తెలుస్తుంది. ఎన్నో రోజులుగా చర్చల్లో ఉన్న ఉద్యోగుల జీతాల పంపు గురించి కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై ఇంతకుముందు కూడా కేబినెట్ లో చర్చలు జరిగాయి. ఐతే సీఎం సిద్ధారామయ్యకే తుది నిర్ణయం వదిలేసింది. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జీతాలు పెంచారు.
7th Pay Commission సమ్మె చేసేందుకు సిద్ధమైన ఉద్యోగ సంఘాలు..
కర్ణాటక ప్రభుత్వం జీతాలు పెంచకపోవడంతో ఆగష్టులో నిరవధిక సమ్మె చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో జీతాల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఉద్యోగుల మూల వేతనంలో 27.5 శాతం పెంచాలని 7వ వేతన సంఘం సూచించిన విధంగానే పెంచుతున్నారు. ఐతే దీని వల్ల ప్రభుత్వ ఖజాపాఈ ప్రతి ఏడాది 17,440 కోట్ల అదనపు భారం పడుతుంది.
2023 లో అప్పటి సీఎం బసవరాజ్ బొమ్మై ఉద్యోగులకు 17 శాతం మధ్యంతర పెంపు ఇచ్చారు. దానికే కాంగ్రెస్ మరో 10.5 శాతం పెంచి జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఓ పక్క ఉద్యోగుల జీతాలు పెంచడంతో పాటుగా సామాన్యుల మీద భారం మోపుతున్నారు. కర్ణాటక వ్యాప్తంగా బస్సు ఛార్జీలు పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది. మహిళలకు ఉచిత బస్సు పథకం సక్సెస్ అయినా కె ఎస్ ఆర్ టీ సీ నష్టాలైతే మరింత పెరిగాయి. గత 3 నెలల్లోనే 295 కోట్ల దాకా నష్టపోయినట్టు తెలుస్తుంది. అందుకే టికెట్ ధరలను భారీగా పెంచి వాటిని రిక్వర్ చేయాలని చూస్తున్నారు.