7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో ఫిట్ మెంట్ ప్రకటన.. రూ.49,420 పెరగనున్న జీతం
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్.. ఇప్పటికే దసరా, దీపావళి సందర్భంగా బోనస్, డీఏ, డీఆర్ ను కేంద్రం పెంచిన విషయం తెలిసిందే. తాజాగా మరో గుడ్ న్యూస్ ను కేంద్రం అందిస్తోంది. అదే ఫిట్ మెంట్ కు సంబంధించి. ఫిట్ మెంట్ కు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు ఫిట్ మెంట్ ను పెంచేందుకు కేంద్రం యోచిస్తోంది. ఫిట్ మెంట్ పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ వేతనం పెరగనుంది.
దానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఫిట్ మెంట్ పెరిగితే 52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాలు పెరుగనున్నాయి. అయితే.. ఫిట్ మెంట్ పెంచాలని, తమ జీతాలు పెంచాలని చాలా రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం 2.57 శాతంతో ఫిట్ మెంట్ ను ఉద్యోగులకు ఇస్తున్నారు. దీన్ని 3.68 కు పెంచే అవకాశం ఉంది.

7th Pay Commission on central govt employees to get fitment very soon
7th Pay Commission : చాలా రోజుల నుంచి ఫిట్ మెంట్ పెంచాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగులు
3.68 శాతానికి పెంచితే ఒక్కసారిగా జీతాలు పెరగనున్నాయి. 2.57 నుంచి 3.68 కు ఫిట్ మెంట్ పెంచితే బేసిక్ వేతనం 18 వేల నుంచి 26 వేలకు పెరుగుతుంది. 2017 లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ జీతాలు పెరగలేదు. మధ్యలో డీఏ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీసం రూ.18 వేల మూల వేతనాన్ని, గరిష్ఠంగా రూ.56,900 మూల వేతనాన్ని పొందుతున్నారు. ఇప్పుడు ఫిట్ మెంట్ పెంచితే హైలేవల్ ఉద్యోగుల వేతనం కనీసం రూ.50 వేల వరకు పెరగనుంది.