7th Pay Commission : మార్చి జీతంతో పాటు పెండింగ్ డీఏ ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం.. ఉద్యోగులు ఫుల్ ఖుష్
7th Pay Commission: కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులు డీఏ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో శుభవార్త అని చెప్పకనే చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ప్రయోజనాన్ని కల్పించే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంది.. మార్చి నెల జీతం తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు కూడా రానున్న ప్రయోజనాలు కూడా ఖాతాలో జమ కానున్నాయి. డియర్ నెస్ అలవెన్స్ తో పాటు ఎన్నో ప్రయోజనాలను కూడా విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈసారి మూడు శాతం డీఏ పెరుగుతుందని ఇదే జరిగితే 34 శాతం డీఏను ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు అందుకోబోతున్నారు అని సమాచారం.
సోమవారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 7వ వేతన సంఘం కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన 20% బకాయిలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు ఇప్పుడు వారి మార్చి జీతంతో పాటు బకాయిలను పొందుతారు. దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు తమ మార్చి జీతంతో పాటు బకాయిలను అందుకోనున్నారు అని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 2021-22 సప్లిమెంటరీ బడ్జెట్‌లో అదనంగా రూ.850 కోట్లు కేటాయించినట్లు తెలిపింది.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే 80 శాతం పే కమీషన్ జీతాల శ్లాబ్ బకాయిలు అందాయని, ఆలస్యమైన బకాయిలను విడుదల చేయడం వల్ల దాదాపు 4 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.
7th Pay Commission : భలే అదృష్టం..
ఒడిశా ప్రభుత్వం 7వ వేతన సంఘం సిఫార్సులను ఆమోదించి జనవరి 2016లో వాటిని అమలు చేయడం ప్రారంభించిందని గమనించడం ముఖ్యం. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరిగింది. 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు జనవరి 2014 నుంచి ఆగస్టు 2018 మధ్య కాలంలో 20 నెలలకు పెంచిన బకాయిలను వివిధ వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయించారు.నిర్ణయం ప్రకారం, పెరిగిన వేతనంలో 2016-17లో 40 శాతం, 2019-20లో 10 శాతం మరియు 2021-22లో 30 శాతం క్లియర్ చేయబడింది. పెన్షనర్లు కూడా 100 శాతం జీతాలు పొందడం గమనార్హం. అలాగే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డీఏను 31% నుంచి 34%కి పెంచే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.