7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ, జీతం పెంపుపై నిర్ణయం.. భారీగా పెరగనున్న జీతాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ, జీతం పెంపుపై నిర్ణయం.. భారీగా పెరగనున్న జీతాలు

 Authored By kranthi | The Telugu News | Updated on :16 March 2023,6:00 pm

7th Pay Commission : ఎప్పుడెప్పుడా అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాల పెంపు, డీఏ పెంపు, డీఏ బకాయిల చెల్లింపు కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్రాన్ని తమకు రావాల్సిన అలవెన్స్ లపై ప్రశ్నిస్తున్నా ఇంకా కేంద్రం మాత్రం సరైన నిర్ణయం తీసుకోవడం లేదు. ఉద్యోగ సంఘాలు కూడా కేంద్రాన్ని వెంటనే జీతాల పెంపు, డీఏ పెంపు, డీఏ బకాయిల చెల్లింపుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. జనవరిలోనే డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోవాలి. కానీ.. ఇప్పటి వరకు కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుతో పాటు

7th Pay Commission salary hike announcement for central govt employees

7th Pay Commission salary hike announcement for central govt employees

ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పెంపుపై కూడా నిర్ణయం తీసుకోవాలి. అలాగే.. డీఏ బకాయిల చెల్లింపు.. ఈ మూడు అంశాలపై హోలీ పండుగ సందర్భంగా నిర్ణయం వెలువడుతుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు కానీ.. కేంద్రం నుంచి నిర్ణయం వెలువడలేదు.ప్రస్తుతం ఉన్న డీఏ 38 శాతం. అది 42 శాతానికి పెరగాలి. ప్రస్తుతం ఉన్న సీపీఐ ఐడబ్ల్యూ ఇండెక్స్ ప్రకారం డీఏ 42 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.

good news to pensioners and employees by central govt

7th Pay Commission salary hike announcement for central govt employees

7th Pay Commission : 38 నుంచి 42 శాతానికి పెరగనున్న డీఏ

సంవత్సరానికి రెండు సార్లు డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది. గత సంవత్సరం సెప్టెంబర్ లో డీఏ 38 శాతానికి పెరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు డీఏ పెరగలేదు. అలాగే.. 18 నెలల డీఏ బకాయిలపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల లోక్ సభలోనూ డీఏ బకాయిల చెల్లింపుపై చర్చ జరిగింది. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది సందర్భంగా కేంద్రం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. ఒకేసారి త్రిపుల్ ధమాకా రానుంది. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పై ఉగాది సందర్భంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది