7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 18 నెలల డీఏ బకాయిలు అకౌంట్ లోకి.. ఎప్పుడంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 18 నెలల డీఏ బకాయిలు అకౌంట్ లోకి.. ఎప్పుడంటే?

 Authored By jagadesh | The Telugu News | Updated on :23 October 2022,6:00 pm

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు డీఏ పెంచిన విషయం తెలిసిందే. దసరా, దీపావళి కానుకగా కేంద్రం డీఏను పెంచింది. అలాగే.. 18 నెలల డీఏ బకాయిలను కూడడా చెల్లించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. గత ఆగస్టులోనే నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ శివ్ గోపాల్ మిశ్రా కేబినేట్ సెక్రటరీ, నేషనల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కు లెటర్ పంపించారు. 18 నెలల బకాయిల చెల్లింపులపై నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం. వెంటనే ఆ బకాయిలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల అకౌంట్ లో పడనున్నాయి.

18 నెలల డీఏ బకాయిల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. త్వరలోనే కేంద్రం బకాయిల విషయంలో కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల చివర్లోగా కేంద్రం పెండింగ్ లో ఉన్న బకాయిలపై ఒక నిర్ణయం తీసుకోనుంది. నిర్ణయం తీసుకోగానే.. వెంటనే బకాయిల డబ్బు మొత్తం ఉద్యోగుల అకౌంట్ లో జమకానున్నాయి. లేవల్ 1 ఉద్యోగులకు డీఏ బకాయిలు రూ.11,880 నుంచి రూ.37,554 వరకు పడనున్నాయి. లేవల్ 13 ఉద్యోగులు అయితే.. ఏడో సీపీసీ బేసిక్ పే స్కేల్ ప్రకారం రూ.1,23,100 నుంచి రూ.2,15,900 వరకు పొందే అవకాశం ఉంది.

7th Pay Commission update on 18 months da arrears

7th Pay Commission update on 18 months da arrears

7th Pay Commission : 18 నెలల బకాయిల డబ్బు ఎంత మొత్తం అకౌంట్ లో పడనుంది?

లేవల్ 14 ఉద్యోగులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 వరకు పొందుతారు. జనవరి 1, 2020 నుంచి జూన్ 20, 2021 వరకు అంటే దాదాపు 18 నెలల డీఏ బకాయిలు చాలా ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. అందుకే డైరెక్ట్ గా ఉద్యోగులు, పెన్షనర్ల అకౌంట్లలోనే బకాయిలను చెల్లించాలని కేంద్రం యోచిస్తోంది. రిటెయిల్ ద్రవ్యోల్బణం పెరగడం వల్ల.. డీఏ, డీఆర్ చెల్లింపును ఆపేశారని, మరోవైపు పెట్రోల్, డీజిల్, ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటాయని, ఇటువంటి సమయంలో వెంటనే పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించాలని పెన్షనర్లు కోరుతున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది