Husband : భార్య చేసిన పనికి కోటీశ్వరుడైన భర్త .. ఎలానో తెలుసా..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Husband : భార్య చేసిన పనికి కోటీశ్వరుడైన భర్త .. ఎలానో తెలుసా..??

 Authored By aruna | The Telugu News | Updated on :27 October 2023,4:00 pm

ప్రధానాంశాలు:

  •  భార్య చేసిన పనికి కోటీశ్వరుడైన భర్త

Husband  : ఆయన నిరుపేద కుటుంబంలో జన్మించారు. పొట్టకూటికోసం భిక్షాటన కూడా చేశారు.ఆ తర్వాత బిల్డింగ్ లో స్వీపర్ గా, సెక్యూరిటీ గార్డ్ గా పనిచేశారు. చాలా రోజులు తిండి లేక ఖాళీ కడుపుతో నిద్రపోయాడు. అయితే జీవితంలో ఏదో సాధించాలి అనే కసిని మాత్రం వదల్లేదు. ప్రస్తుతం 1000 కార్ల యజమానిగా ఎదిగాడు. దాదాపుగా 38 కోట్ల సామ్రాజ్యాన్ని నడుపుతున్న కర్ణాటక కు చెందిన రేణుక ఆరాధ్య సక్సెస్ స్టోరీ తెలుసుకోవాల్సిందే . బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రేణుక ఆరాధ్య చిన్నప్పటి నుంచి పొట్టకూటి కోసం ఎన్నో పనులు చేశాడు. తన తండ్రి స్కూల్ ఫీజు కట్టలేకపోవడంతో స్కూల్లో ఊడవటం లాంటి పనులు కూడా చేసేవాడు.

తల్లి మరణంతో చదువుకు స్వస్తి. అయితే ఎన్ని కష్టాలు ఉన్నా చదువును కొనసాగించాడు. కొన్నాళ్లకు తండ్రి మరణించడంతో తప్పని పరిస్థితిలో చదువు మానేశాడు. కుటుంబ భారం తన మీద పడడంతో కూలీ పనులకు వెళ్లేవాడు. లేదర్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా మారాడు. రాత్రిపూట సెక్యూరిటీ గార్డ్ గా పనిచేశారు. అంతేకాకుండా ప్లాస్టిక్ ప్లాంట్లో కూడా పనిచేశారు. బట్టల దుకాణంలో పనిచేయటం, కొబ్బరికాయలు అమ్మడం, పెంటింగ్ హౌస్ లో స్వీపర్గా పనిచేయడం ఇలా ఏ పని దొరికితే ఆ పని చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. పెంటింగ్ హౌస్ లో అతడి పనితనాన్ని మెచ్చుకున్న ఓనర్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇప్పించారు. ఆ తర్వాత రేణుక కి తన దగ్గరే ఉద్యోగం కల్పించారు.

ఏడాది పాటు అక్కడే పనిచేసిన అతను డ్రైవింగ్ నేర్చుకోవాలని అనుకున్నారు. ఇది అతడి జీవితంలో స్టన్నింగ్ పాయింట్ గా మారింది. డ్రైవింగ్ నేర్చుకొని చాలా కాలం పాటు డ్రైవర్ గా చేశారు. తన భార్య పొదుపు చేసిన డబ్బుతో పాటు కొంత అప్పు తీసుకుని బ్రహ్మశ్రీ క్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ ని ప్రారంభించారు. ముందుగా ఒక క్యాబ్ కొనుగోలు చేసి సర్వీస్ను అందించారు. రాత్రి పగలు కష్టపడ్డారు. ఆదాయం పెరిగింది. బిజినెస్ విస్తరించడానికి మరిన్ని కార్లను కొన్నారు. ప్రస్తుతం రేణుక వెయ్యికి పైగా కార్లకు యజమాని అయ్యారు. దాదాపుగా 38 కోట్ల విలువైన క్యాబ్ సంస్థను నడిపిస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది