12 మందిని పెళ్లి చేసుకున్న ఓ మహిళ .. చివరికి ఇలా దొరికిపోయింది ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

12 మందిని పెళ్లి చేసుకున్న ఓ మహిళ .. చివరికి ఇలా దొరికిపోయింది ..!!

 Authored By aruna | The Telugu News | Updated on :18 July 2023,3:00 pm

ప్రస్తుతం మారిన కాలం కారణంగా మనిషిలో అన్ని చెడు ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. డబ్బుకు ఇస్తున్న విలువ మనుషులకు ఇవ్వలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో దారుణాలకు ఓడిగడుతున్నారు. ఎదుటివారిని ఈజీగా బురిడీ కొట్టిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇటీవల చాలామంది పురుషులు, మహిళలు కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. పెళ్లి చేసుకొని అందినంత డబ్బుతో ఉడాయిస్తున్నారు. నిత్య పెళ్లికూతురు, పెళ్లి కొడుకు గుట్టురట్టు అవడంతో పోలీసులకు దొరికిపోతున్నారు.

తాజాగా ఓ మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 పెళ్లిళ్లు చేసుకుంది. ఆమె పెళ్లి చేసుకొని తరువాత డబ్బు, నగలను తీసుకోని పారిపోవడం చేసేది. అలా ఏకంగా 12 కు పైగా పెళ్లిళ్లు చేసుకొని అందరిని దారుణంగా మోసం చేసింది. ఓ వ్యక్తి ఆమె మోసానికి గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె బాగోతం బయటపడింది. ఈ ఘటన జమ్ము కాశ్మీర్లో చోటుచేసుకుంది. షాహిన్ అనే 30ఏళ్ల యువతి నాలుగు నెలల క్రితం మహమ్మద్ అల్తాఫ్ ను వివాహం చేసుకుంది. పెళ్లి సందర్భంగా వచ్చిన డబ్బులు, నగలు తీసుకొని ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయింది.

A women marries 12 men

A women marries 12 men

తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన మహమ్మద్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. పోలీసుల దర్యాప్తులో షాహిన్ రాజౌరి జిల్లాలోని నౌషేరాలో ఉంటున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే జులై 14న ఆమెను అరెస్ట్ చేశారు. అయితే ఆమె అరెస్ట్ అయిన విషయం తెలుసుకొని షాహిన్ అక్తర్ తమను కూడా పెళ్లి చేసుకొని మోసం చేసిందని 12మంది పురుషులు ఆరోపించారు. మరోవైపు షాహిన్ బెయిల్ కోసం బుద్గామ్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు. పెళ్లి తర్వాత డబ్బు, నగలతో షాహిన్ ఉడాయించినట్లు ఆరోపించారు. అయితే షాహిన్ ఎంతమందిని పెళ్లి చేసుకుని మోసం చేసిందో దర్యాప్తు చేయాల్సి ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది