Sonu sood : మరోసారి శెభాష్ అనిపించుకున్న సోనూసూద్.. ఈసారి ఏపీ ప్రజలకు దేవుడయ్యాడు..!
Sonu Sood : సోనూ సూద్.. ఈ పేరు ఇప్పుడు ఒక ప్రభంజనం. ఈ పేరు ఇప్పుడు ఒక బ్రాండ్. ఒకప్పుడు ఈ పేరు చెబితే.. విలన్ గుర్తొచ్చేవాడు. పశుపతి గుర్తొచ్చేవాడు. కానీ.. ఇప్పుడు అదే మనిషిలో ఒక దేవుడు కనిపిస్తున్నారు. రియల్ హీరో కనిపిస్తున్నాడు. అసలైన మనిషి కనిపిస్తున్నారు. మానవత్వం కలబోసిన వ్యక్తి కనిపిస్తున్నాడు. సోనూ సూద్ అంటే ఒక పేరు కాదు.. అదో శక్తి. కలియుగంలో దేశ ప్రజల కోసం నేనున్నాను అంటూ ముందుకొచ్చిన ప్రత్యక్ష దైవం. ఇలా సోనూ సూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన్ను చూసి.. సినిమా నటులే కాదు.. అందరూ ఎంతో నేర్చుకోవాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటే.. ఈ దేశం అభివృద్ధిలో ఎప్పుడూ ముందంజలో ఉంటుంది.
గత సంవత్సరం కరోనా మొదటి వేవ్ సమయం నుంచి ఇప్పటి వరకు సోనూ సూద్ చేస్తున్న సాయం మామూల్ది కాదు. చాలా గొప్పది. ఇప్పటికి వందల మందికి ఆయన సాయం చేశారు. చేస్తూనే ఉన్నారు. కష్టమొచ్చింది అని ఆయనకు మొర పెట్టుకుంటే చాలు.. టక్కున అక్కడ వాలిపోయి.. వాళ్లకు కావాల్సినంత సాయం చేస్తారు. ప్రస్తుతం సోనూసూద్.. ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ ప్లాంట్ల మీద దృష్టి కేంద్రీకరించారు. ఎందుకంటే.. చాలామంది కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లు.. సరైన సమయానికి ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. అందుకే… ఎక్కడ ఆక్సిజన్ కావాలంటే అక్కడికి వెంటనే సోనూ సూద్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతోనూ సోనూ సూద్ ట్రస్ట్ మాట్లాడుతూ.. ఆక్సిజన్ సరఫరాకు సహకరిస్తోంది.
Sonu Sood : ఏపీలో 2 కోట్లతో ఆక్సిజన్ జనరేటర్ ను ఏర్పాటు చేసిన సోనూసూద్
ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ సరఫరాకు చాలా ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు.. సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సోనూసూద్ వెంటనే 2 కోట్ల రూపాయలతో నెల్లూరులో 1.5 టన్నుల కెపాసిటీతో ఆక్సిజన్ జనరేటర్ ను ఏర్పాటు చేశారు. దాన్నే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ అని కూడా అంటారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ఉన్న జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు సోనూసూద్. ఈ ఆక్సిజన్ ప్లాంట్ వల్ల నెల్లూరు జిల్లాలో ఉన్న మొత్తం 36 కోవిడ్ కేర్ ఆసుపత్రులకు, 24 ప్రైవేటు ఆసుపత్రులకు సరిపోయేంత ఆక్సిజన్ సరఫరా కానుంది. లేఖ రాయగానే వెంటనే రెస్పాండ్ అయి.. తక్షణమే ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేయించిన సోనూసూద్ కు జిల్లా కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు జిల్లా ప్రజలు కూడా ఈ విషయం తెలిసి చాలా సంతోషిస్తున్నారు.