Akhila Priya : మేనమామ ద్వారా మంతనాలు వైసీపీలోకి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Akhila Priya : మేనమామ ద్వారా మంతనాలు వైసీపీలోకి..!

Akhila Priya : తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఈమధ్య బాగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ కి దగ్గరలోని బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయి జైల్లో కూడా ఉండి వచ్చింది. దీంతో ఒక వైపు ఆర్థిక ఇబ్బందులు.. మరో వైపు కేసులు, విచారణలు. అసలే పెద్ద దిక్కు లేని కుటుంబం. పొలిటికల్ గా తెలుగుదేశం పార్టీ నుంచి మద్దతు కరవు. ఈ నేపథ్యంలో.. కష్టాలొచ్చినప్పుడే దేవుడు […]

 Authored By kondalrao | The Telugu News | Updated on :17 June 2021,1:45 pm

Akhila Priya : తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఈమధ్య బాగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ కి దగ్గరలోని బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయి జైల్లో కూడా ఉండి వచ్చింది. దీంతో ఒక వైపు ఆర్థిక ఇబ్బందులు.. మరో వైపు కేసులు, విచారణలు. అసలే పెద్ద దిక్కు లేని కుటుంబం. పొలిటికల్ గా తెలుగుదేశం పార్టీ నుంచి మద్దతు కరవు. ఈ నేపథ్యంలో.. కష్టాలొచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడనే సామెత మాదిరిగా భూమా అఖిలప్రియకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చారు. అయితే సీఎం వైఎస్ జగన్ దగ్గరికి డైరెక్టుగా వెళ్లేందుకు అఖిలప్రియకు మొహం లేక తన మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి ద్వారా మళ్లీ వైఎస్సార్సీపీ గూటికి చేరాలని అనుకుంటోంది.

akhila priya May be Joine in Ysrcp

akhila priya May be Joine in Ysrcp

అధికారం ముఖ్యం..

అఖిలప్రియకు అధికారం ఉంటే చాలు. మిగతావన్నీ డోంట్ కేర్. అప్పుడంటే (2014లో) తండ్రి నిర్ణయం మేరకు మేనమామతో కలిసి వైఎస్సార్సీపీని కాదని టీడీపీలోకి వెళ్లింది. అక్కడైనా ఇప్పుడు స్థిరంగా ఉండొచ్చు కదా?. నో.. వే. మళ్లీ తెలుగుదేశానికి గుడ్ బై కొట్టి వైఎస్సార్సీపలోకి జంప్ చేయటానికి సిద్ధపడుతోంది. నంద్యాల విషయంలో రాజీపడటానికైనా రెడీ అంటూ కాళ్ల బేరానికి వచ్చింది. అంతలోనే ఆళ్లగడ్డ మాకే కావాలంటూ కండిషన్ పెడుతోంది. వైఎస్సార్సీపీలో ఇంకా జాయిన్ కూడా కాలేదు. అప్పుడే ‘షరతులు వర్తిస్తాయి’ అంటూ అల్టిమేటం జారీ చేయటం అఖిలప్రియ రాజకీయ అపరిపక్వతకు అద్దం పడుతోంది.

అంత అవసరం ఏముంది?..: Akhila Priya

TDP

TDP

అఖిలప్రియ అడ్వాన్స్ గా పెడుతున్న ఆంక్షలకు కూడా ఓకే చెప్పి ఆమెను వైఎస్సార్సీపీలో చేర్చుకోవాల్సినంత అవసరం వైఎస్ జగన్ కి ఏముంది అనేదే అధికార పార్టీ వాళ్ల ప్రశ్న. పైగా ఆమెకిప్పుడు ఆ కిడ్నాప్ కేసులో క్లీన్ చిట్ కూడా రాలేదు. అలాంటి అఖిలప్రియను పార్టీలోకి తీసుకోవటం వల్ల వైఎస్సార్సీపీకే బ్యాడ్ నేమ్ వస్తుంది తప్ప ఇప్పటికిప్పుడు ఒరిగేదేం లేదు. అంతేకాదు. విమర్శించేందుకు ప్రతిపక్ష పార్టీలకి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతంది. నేరస్తులకు అడ్డా వైఎస్సార్సీపీ అని ఇదే తెలుగుదేశం ఎద్దేవా చేసినా చేస్తుంది.

అయినప్పటికీ..

ఎస్వీ మోహన్ రెడ్డి మీద ఉన్న గౌరవంతో, అతని సోదరి బిడ్డ అని, తల్లీ తండ్రీ లేని ఆడబిడ్డ అని పెద్ద మనసుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమా అఖిలప్రియను పార్టీలోకి ఆహ్వానించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అఖిలప్రియ తల్లి, దివంగత శోభానాగిరెడ్డి ఒకప్పుడు వైఎస్ జగన్ కష్టాల్లో ఉండగా అండగా నిలిచారు. అవన్నీ వైఎస్ జగన్ మర్చిపోడు. దీనికితోడు దాదాపు ఏ పొలిటికల్ పార్టీ కూడా ఫలానా నాయకుడు లేదా నాయకురాలు వస్తానంటే వద్దనదు. సాధ్యమైనంత ఎక్కువ మందిని చేర్చుకోవటానికే ప్రాధాన్యత ఇస్తుంది. కాకపోతే కండిషన్లకు మాత్రం ఒప్పుకోకపోవచ్చు. తర్వాత చూద్దాంలే అంటూ మాట దాటేసే అవకాశం ఉంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> Nimmagadda : నిమ్మగడ్డా.. నిన్ను వదల..

ఇది కూడా చ‌ద‌వండి ==> Chandra Babu : ఆ పోస్టు కోసం.. చంద్రబాబు వెతుకుతున్న వ్యక్తి ఎవరో?..

ఇది కూడా చ‌ద‌వండి ==> CM Ys Jagan : ఆ ఒక్క తప్పు.. సీఎం వైఎస్ జగన్ డేంజ‌ర్‌లో ప‌డిన‌ట్లేనా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> Ysrcp : ఇన్నాళ్లకు వాళ్ల దశ తిరుగుతోంది..!

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది