Munugodu Bypoll : “మేము మునుగోడులో పుట్టినా బాగుండేది” అని ఫీల్ అవుతున్న తెలంగాణ జనం
Munugodu Bypoll : సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా సరే.. ఓటర్లకు డబ్బులు ఇవ్వడం సహజమే. మద్యం కూడా ఏరులై పారుతుంది. ప్రతి పార్టీ జనాలకు డబ్బులు ఇచ్చి తమ పార్టీకి ఓటేయాలని కోరుతుంది. అది ఎక్కడైనా ఉంటుంది. కానీ.. మునుగోడు ఉపఎన్నికలో ఏకంగా ఓట్ల వేలంపాటలే మొదలయ్యాయట. అవును.. ఓవైపు బీజేపీ, మరోవైపు టీఆర్ఎస్.. ఈ రెండు పార్టీలు ఒక దాని మీద మరొకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి. బీజేపీ ఒక్క ఓటుకు ఇంత ఇస్తోంది అంటూ టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ ముందే బేరం ఫిక్స్ చేసుకుందని.. ఓటును ఇంత ధర పెట్టి కొంటున్నారని ఆరోపించింది. అయితే..
టీఆర్ఎస్ కూడా ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుండటంతో ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఊరుకుంటుందా? కాంగ్రెస్ పార్టీ కూడా జనాలను డబ్బుతో ఆకర్షించాలి కదా. అంటే.. ప్రధాన పార్టీలు మూడు ప్రతి ఓటరుకు అంతో ఇంతో ముట్టజెప్పాల్సిందే. ఇంకా ఎన్నికలకు చాలా రోజుల సమయం ఉంది. ఇంకా ఎన్నకలు దగ్గరికి వస్తే అప్పుడు ఒక్క ఓటుకు ఎంత పలుకుతుందో. టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఓటుకు రూ.40 వేలు ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. మరోవైపు బీజేపీ పార్టీ రూ.30 వేలకు బేరం కుదుర్చుకుందని టీఆర్ఎస్ మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అంటే..
Munugodu bypoll : బీజేపీ రూ.30 వేలకు బేరం కుదుర్చుకుందట
ఓవైపు టీఆర్ఎస్ 40 వేలు ఇవ్వడానికి రెడీ అవుతుంటే.. బీజేపీ 30 వేలు ఇవ్వడానికి రెడీ అవుతోందన్నమాట. ఒక్క ఓటుకు టీఆర్ఎస్, బీజేపీ కలిసి రూ.70 వేలు చెల్లిస్తున్నాయా అనేది అంతుపట్టడం లేదు. ఇక.. ఈ రెండు పార్టీలు ఇంత చెల్లిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ ఎంత ఇవ్వాలి. కనీసం రూ.10 వేలు అయినా ఇవ్వాలి కదా. హుజూరాబాద్ ఉపఎన్నికలో డబ్బులు, మద్యం ఎలా ఏరులై పారాయో అందరికీ తెలుసు కదా. ఒక కుటుంబానికి ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో కనీసం మూడు లక్షల రూపాయలు దాకా అందుతున్నాయట. అంటే.. కనీసం నాలుగు ఓట్లు ఉన్నా చాలు.. లక్షలే లక్షలు. అందులోనూ ప్రతి ఓటరుకు.. ప్రతి పార్టీ డబ్బులు ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఈనేపథ్యంలో జనాలు డబ్బుల వర్షం కురుస్తోంది.