Munugode Bypoll : వామ్మో.. మునుగోడులో ఏరులై పారిన మద్యం.. ఎంతంటే..?
Munugode Bypoll: తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే రీతిలో జరిగింది. ఈ ఉపఎన్నిక నేపథ్యంలో చోటు చేసుకున్న సంఘటనలు రాజకీయంగా పెను సంచలనాలు రేపాయి. రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు మునుగోడు ఉపఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఇక ఇదే సమయంలో ఉపఎన్నికల నేపథ్యంలో నెల రోజులలో దాదాపు ₹300 కోట్ల రూపాయల మద్యం అమ్మడైనట్లు లెక్కలు బయటపడ్డాయి.
ఓటర్లను ఆకర్షించడానికి ఇతర జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో మద్యాన్ని మునుగోడు నియోజకవర్గానికి తరలించే పరిస్థితి ఏర్పడిందట. తెలంగాణ ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున దావత్ లు ఇవ్వటం జరిగాయట. ఈ క్రమంలో ఏకంగా మంత్రి కూడా కార్యకర్తలకు మందు పోసిన ఫోటోలు బయటకు రావడం జరిగాయి. ఈ ఉప ఎన్నిక కారణంగా తెలంగాణ ఖజానాకు ఎక్సైజ్ శాఖ నుండి భారీగా కాసులు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖకు మద్యం అమ్మకాల ద్వారా ₹2700 కోట్ల సమకూడాగా…
అక్టోబర్ నెలలో ఈ అమ్మకాలు ఏకంగా ₹3037 కోట్లకు చేరుకున్నాయి. ఒక మునుగోడు లోనే ₹300 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయట. ముఖ్యంగా మునుగోడు ఎన్నికలకు పది రోజులు ముందు దాదాపు ₹160 కోట్లకు పైగానే మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నికలలో గెలుపు కోసం ఓటర్లను మద్యం మత్తుల ప్రధాన పార్టీలు ఏరులై పారేలా చేశారట. కొన్ని మండలాల్లో ఏకంగా వైన్ షాపులను రాజకీయ పార్టీలు లీజుకు తీసుకుని మరి పంపిణీ చేసినట్లు టాక్.