ChandraBabu : చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వం పై పదే పదే అక్కసు వెళ్లగక్కుతూ బాదుడు ప్రభుత్వం అంటూ జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే జనాలకు అన్ని విషయాలు తెలుసు.. ఏ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎలాంటి బాదుడు జరిగిందో వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో పెరిగిన ధరలు.. ఇతర బాదుడు గురించి జనాలు అప్పుడే ఎలా మర్చి పోతారు అంటూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబు నాయుడుకు కౌంటర్ గా అంబటి మీడియా ముందుకు వచ్చి వీర బాదుడు సమాధానం ఇచ్చాడు.
జగన్ ప్రభుత్వం బాదుడే బాదుడు అంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారంను మంత్రి రాంబాబు తిప్పి కొట్టారు. ఆయన మాట్లాడుతూ బాదుడు అనే పదం చంద్రబాబు నాయుడు కు సరిగ్గా సరి పోతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. చంద్రబాబు నాయుడు గతంలో ప్రభుత్వంలో ఉన్న సమయంలో విద్యుత్ ఛార్జీలు మొదలుకుని ఆర్టీసీ బస్సు టికెట్ల వరకు ప్రతి ఒక్కటి కూడా పెంచారు. అప్పు ను భారీగా తీసుకు వచ్చి జనాల కు చిప్పను ఇచ్చే పనిని చేశారు. దాంతో వారు తెలుగు దేశం పార్టీని పక్కన పెట్టి జగన్ కు అవకాశం ఇచ్చారని అంబటి అన్నాడు.వైకాపా ప్రభుత్వంలో ప్రజలకు బాదుడు ఎక్కువ అయ్యిందని అంటున్నారు.

అదే విషయం నిజం అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరియు మున్సిపల్ ఎన్నికల్లో మీకు ఎందుకు జనాలు బాసటగా నిలువలేదు.. మళ్లీ జగన్ కు ఎందుకు మద్దతు ఇచ్చారు.. ప్రతి చోట కూడా వైకాపా కు అద్బుతమైన విజయాలను సాధించి పెట్టడంకు కారణం ఏంటీ అంటూ అంబటి ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం మరియు అభివృద్ది కోసం జగన్ ప్రభుత్వం కృషి చేస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న బాదుడును తగ్గించినందుకు ఇప్పుడు వారు విమర్శలు చేస్తున్నారు అంటూ బాబు బాదుడు విమర్శలకు అంబటి వీర బాదుడు సమాధానం ఇచ్చాడు.