Rain : తెలుగు రాష్ట్రాలకి ఐఎండీ వార్నింగ్.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ వారు అప్రమత్తంగా ఉండాలంటూ సూచన..!
ప్రధానాంశాలు:
Rain : తెలుగు రాష్ట్రాలకి ఐఎండీ వార్నింగ్..ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ వారు అప్రమత్తంగా ఉండాలంటూ సూచన..!
Rain : ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాల రైతులు వర్షాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. జూన్ నెల ప్రారంభంలోనే రుతు పవనాలు విస్తరించినా.. వర్షాలు మాత్రం అనుకున్న మేర పడలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులే నెలకొని ఉన్నాయి. అయితే జూలై నెలలో జోరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ నెలలో సగం రోజులు పూర్తయ్యాయి. కానీ ఆశించిన మేర వర్షాలు పడలేదు.దీంతో రానున్న పదిహేను రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు.
Rain జోరుగా వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో అసలైన వానాకాలం ఇప్పుడు వచ్చినట్లు కనిపిస్తోంది. అంచనాలకు తగినట్లుగా వానలు పడుతున్నాయి. అటు రైతులకు కావాల్సిన వాన నీరు అందుతోంది. ఇటు భూ గర్భ జలాలు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీనడం ఏర్పడిందని.. దాంతో రానున్న 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఎండీ కీలక అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఏపీ తీరంలో సముద్ర మట్టానికి సగటున 5.8 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించిన ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవాళ కోస్తాంధ్ర, యానాంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. ఇలా ప్రత్యేకంగా చెప్పింది కాబట్టి.. ఆ ప్రాంతాల్లో వారు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే. భారీ వర్షాల నేపధ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని ఇప్పటికే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసర సహాయక చర్యల కోసం విపత్తుల నిర్వహణ సంస్థలో 24గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించాలన్నారు.