Anushka : అతనే నాకు ప్రపోజ్ చేశాడు.. నేను ఓకే చెప్పానంటూ అనుష్క ఆసక్తికర కామెంట్స్
ప్రధానాంశాలు:
Anushka : అతనే నాకు ప్రపోజ్ చేశాడు.. నేను ఓకే చెప్పానంటూ అనుష్క ఆసక్తికర కామెంట్స్
Anushka : అరుంధతి, బాహుబలి లాంటి పవర్ఫుల్ చిత్రాలలో నటించి.. తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన ముద్దుగుమ్మ అనుష్క. సూపర్ సినిమాతో పరిచయమైన అనుష్క ఆ తరువాత తెలుగులో ఎన్నో మంచి చిత్రాలలో నటించింది. ఈ హీరోయిన్ త్వరలోనే క్రిష్ దర్శకత్వంలో రానున్న ..ఘాటీ చిత్రంలో కనిపించనుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి.

Anushka : అతనే నాకు ప్రపోజ్ చేశాడు.. నేను ఓకే చెప్పానంటూ అనుష్క ఆసక్తికర కామెంట్స్
Anushka : లవ్‌పై ఓపెన్
ఎన్నో సంవత్సరాలుగా ప్రభాస్, అనుష్క మధ్య ప్రేమాయణం నడుస్తోంది అన్న వార్త వినిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ మధ్య అలాంటిదేమీ లేదు అని పలుమార్లు క్లారిటీ ఇచ్చారు వీరిద్దరు. ఈ క్రమంలో.. ఈ హీరోయిన్ ని తన తొలిప్రేమ గురించి చెప్పమని అడగగా.. ఆ విషయం కాస్త బయట పెట్టింది. తను ఆరో తరగతిలో ఉన్నప్పుడు.. ఒక అబ్బాయి తనకు ప్రపోజ్ చేశారు అని చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.
నువ్వంటే చచ్చేంత ఇష్టమని ఆ అబ్బాయి ప్రపోజ్ చేయడంతో అప్పటికి ఐ లవ్ యు అంటే ఏంటో కూడా తెలియని నేనూ ఓకే అని చెప్పేశాను. నా లైఫ్ లో అదొక మెమొరీగా గుర్తుండిపోయిందంటూ అనుష్క చెప్పుకొచ్చింది. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ ఎందుకు బ్రేకప్ అయ్యింది అని అనుమానాలు మొదలయ్యాయి. ఇక ఈ ప్రశ్నలకు ఈ హీరోయిన్ మరో ఇంటర్వ్యూలో జవాబు చెబుతుందో లేదో చూడాలి.