Holidays : భారీ వర్షాల కారణంగా అన్ని విద్యాసంస్థలకు మళ్లీ సెలవులు.. ఎన్ని రోజులంటే..!
Holidays : దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలలో నదులు, వాగులు, చెరువులు డ్యాం లు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే చాలా గ్రామాలు నీట మునిగాయి. ఇక ఇదే సమయంలో చాలా పాఠశాలలలో వర్షపు నీరు చేరుకోవటంతో.. విద్యార్థులు కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది. వారం పైగా కురుస్తున్న ఎడతెరిపి వాన కారణంగా భారీ వరదలపై తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముంపు ప్రభావిత ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవు దినంగా ప్రకటించాలని నిర్ణయం తీసుకుని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. శనివారం మొహర్రం సెలవు కావడంతో ప్రభుత్వ విద్యాసంస్థలు అన్నీ సోమవారం తెరుచుకోనున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత మూడు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ మీరు ఉండిపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింతగా పెరిగింది. దీంతో హైదరాబాద్ వాతావరణ కేంద్ర డైరెక్టర్ కె.నాగరత్న హైఅలర్ట్ ప్రకటించారు.
ఈరోజు రాత్రి ఐదు సెంటీమీటర్ల నుండి 6 సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఉందని అధికారులను ముందుగానే హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు ప్రజలను రానివ్వకుండా చూసుకోవాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. విజయ పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉండటంతో శుక్రవారం నుండి అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా.. శుక్రవారం నుండి ఆదివారం వరకు సెలవులు ప్రకటించడం జరిగింది