AP Cabinet : ఎవ్వరూ ఊహించని ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వనున్న సీఎం జగన్?
AP Cabinet : ప్రస్తుతం ఏపీలో ఒకటే చర్చ. ఏపీ సీఎం జగన్ త్వరలో తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు అనేదే హాట్ టాపిక్. ఎందుకంటే.. మొదటి సారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి దక్కుతుందని ఆశ పడ్డారు. కానీ.. అనుకున్న వాళ్లకు దక్కలేదు. అనుకోని వాళ్లకు మంత్రి పదవి దక్కింది. దీంతో చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు కాస్త అసంతృప్తికి లోనయ్యారు. దీంతో సీఎం జగన్.. వాళ్లను బుజ్జగించారు. మరోసారి మంత్రి వర్గ విస్తరణను చేపడతామని.. అప్పుడు మరికొందరికి చాన్స్ ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఇంకొందరు అసంతృప్తులకు వేరే పదవులు ఇచ్చి వాళ్లను శాంతింపజేశాయి. అయితే.. తాజాగా మరోసారి మంత్రివర్గ విస్తరణ ప్రస్తుతం లైన్ మీదికి వచ్చింది.
దీంతో.. చాలామంది ఎమ్మెల్యేలు.. తమకు మంత్రి పదవి వస్తుందని.. ఆశతో ఎదురు చూస్తున్నారు. దాని కోసం బాగానే హైకమాండ్ వద్ద ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే.. ఎవరికి సీఎం జగన్ మంత్రి పదవిని ఇస్తారు? ఇప్పుడు ఉన్నవాళ్లలో ఎవరినైనా మంత్రి పదవి నుంచి తీసేస్తారా? తీసేస్తే ఎవరిని తొలగిస్తారు? ఎవరికి కొత్తగా చాన్స్ ఇస్తారు? అనే దానిపై ఏపీ వ్యాప్తంగా తీవ్రంగా చర్చ జరుగుతోంది.
AP Cabinet : కాబోయే మంత్రి అంటూ.. ఆ నియోజకవర్గంలో హడావుడి
అయితే.. ప్రస్తుతం ఓ ఎమ్మెల్యే పేరు తెరమీదికి వచ్చింది. అసలు ఎవ్వరూ ఊహించని ఎమ్మెల్యే ఆయన. ఆ ఎమ్మెల్యేకు జగన్ మంత్రి పదవి ఇవ్వబోతున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. కాబోయే మంత్రి.. అంటూ ఆయన అనుచరులు.. ఆ నియోజకవర్గంలో తెగ హడావుడి చేస్తున్నారట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? అంటారా? కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అట ఆయన. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా..
బ్యానర్లు వెలిశాయట. కాబోయే మంత్రి అంటూ ఆ ఎమ్మెల్యే పేరుతో ఆయన అనుచరులు బ్యానర్లు ఏర్పాటు చేసి తెగ హడావుడి చేస్తున్నారట. నిజానికి.. ఆ ఎమ్మెల్యేకు కొంచెం దూకుడు ఎక్కువే. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. ప్రజలతో ఎక్కువగా మమేకం అవుతుంటారు. తన నియోజకవర్గంలోనే కాదు.. తన జిల్లాలో ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా ముందుండే నాయకుడు ఆయన. అందుకే.. ఆయనకు సీఎం జగన్ ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు.. అనే వార్తలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. అయితే.. అదే కృష్ణా జిల్లా నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో అసలు.. ఎవరికి మంత్రి పీఠం దక్కుతుందో? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.