Anandayya Ayurveda Medicine : ఆనంద‌య్య క‌రోనా మందును ఇంట్లోనే ఇలా త‌యారు చేసుకోండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anandayya Ayurveda Medicine : ఆనంద‌య్య క‌రోనా మందును ఇంట్లోనే ఇలా త‌యారు చేసుకోండి..!

Anandayya Ayurveda Medicine : కృష్ణపట్నం ఆనందయ్య గురించి ప్రస్తుతం దేశమంతా మారుమోగిపోతోంది. ఆయన కనిపెట్టిన కరోనా మందుకు ఎంత డిమాండ్ ఉందంటే.. ఆ మందు కోసం వేల మంది క్యూలు కట్టారు. కరోనా వచ్చి చావు బతుకుల మధ్య ఉన్నవాళ్లు కూడా ఆ మందును వాడి కరోనాను జయించారు. ఇక.. ఆక్సిజన్ తక్కువగా ఉన్నవాళ్లు అయితే.. ఆనందయ్య కంటి మందును వేసుకున్న 5 నిమిషాల్లో లేచి కూర్చున్నారు. వాళ్ల ఆక్సిజన్ లేవల్స్ అమాంతం పెరిగాయి. ఇదంతా […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :28 May 2021,4:49 pm

Anandayya Ayurveda Medicine : కృష్ణపట్నం ఆనందయ్య గురించి ప్రస్తుతం దేశమంతా మారుమోగిపోతోంది. ఆయన కనిపెట్టిన కరోనా మందుకు ఎంత డిమాండ్ ఉందంటే.. ఆ మందు కోసం వేల మంది క్యూలు కట్టారు. కరోనా వచ్చి చావు బతుకుల మధ్య ఉన్నవాళ్లు కూడా ఆ మందును వాడి కరోనాను జయించారు. ఇక.. ఆక్సిజన్ తక్కువగా ఉన్నవాళ్లు అయితే.. ఆనందయ్య కంటి మందును వేసుకున్న 5 నిమిషాల్లో లేచి కూర్చున్నారు. వాళ్ల ఆక్సిజన్ లేవల్స్ అమాంతం పెరిగాయి. ఇదంతా కలలా ఉన్నా.. పచ్చి నిజం. కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన కరోనా మందుకు ఉన్న పవర్ అటువంటిది. ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనాను ఆయుర్వేదంతో తరిమికొట్టొచ్చని ఆనందయ్య నిరూపించి చూపించారు.

అయితే.. ఆ మందుపై ఇప్పటికే ఆయుష్ శాఖ పరిశోధనలు జరిపింది. కాకపోతే అది నాటు మందు అని.. అని ఆయుర్వేద మందుగా గుర్తించలేమని.. కానీ అందులో వాడే పదార్థాలన్నీ వనమూలికలు, మూలికా దినుసులు కావడంతో వాటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి.. ఆ మందును తీసుకోవడం, తీసుకోకపోవడం అనేది ప్రజలకే వదిలేస్తున్నాం.. అని ఆయుష్ కమిటీ తేల్చి చెప్పింది. అయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి కరోనా మందు పంపిణీని నిలిపివేసింది. ఢిల్లీకి ఆ మందును టెస్ట్ కోసం పంపించింది. అప్పటి వరకు కరోనా మందు పంపిణీని చేయవద్దని ఆనందయ్యను ప్రభుత్వం కోరింది. దీంతో ప్రస్తుతం ఆ మందును ఎలా తయారు చేయాలా? అని అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. సామాజిక మాధ్యమాల్లో కరోనా మందు తయారు చేసే విధానం ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది.

krishnapatnam Anandayya ayurvedic medicine preparing method

krishnapatnam Anandayya ayurvedic medicine preparing method

Anandayya Ayurveda Medicine : ఆనందయ్య ఆయుర్వేద మెడిసిన్ ను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం

ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందును తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల కోసం ఎక్కడో తిరగాల్సిన పనిలేదు. దాని కోసం ఏదైనా ఆయుర్వద షాపునకు వెళ్లినా చాలు. కొన్ని వనమూలికలు అడవిలో దొరుకుతాయి. ఈ ఔషధాన్ని ఆయుష్ డిపార్ట్ మెంట్ వాళ్లు కూడా తయారు చేస్తున్నారు. దాని కోసం వాడిన వనమూలికలు, మూలికా దినుసులు ఇవే.

krishnapatnam Anandayya ayurvedic medicine preparing method

krishnapatnam Anandayya ayurvedic medicine preparing method

తెల్ల జిల్లేడు పూలు  –  200 గ్రాములు

మారేడు ఇగురు – 200 గ్రాములు

నేరేడు ఇగురు – 200 గ్రాములు

వేప ఇగురు –  200 గ్రాములు

డావరడంగి ఆకులు – 200 గ్రాములు

నల్ల జీలకర్ర – 30 గ్రాములు

పట్టా దాల్చిన చెక్క – 30  గ్రాములు

పసుపు – 30 గ్రాములు

తోక మిరియాలు – 30 గ్రాములు

పచ్చ కర్పూరం – 30 గ్రాములు

ఫిరంగి చెక్క – 30 గ్రాములు

తేనె – 200 గ్రాములు

తాటి బెల్లం – 200 గ్రాములు

ఈ పదార్థాలను అన్నింటినీ.. మిక్సీలో వేసి బాగా రుబ్బాలి. పేస్ట్ లాగా చేయాలి. ఆ తర్వాత ఆ పేస్ట్ ను తీసి ఓ గిన్నెలో వేసి.. వేడి చేయాలి. అది ముద్దగా మారేంత వరకు ఆ మిశ్రమాన్ని బాగా ఉడకబెట్టాలి. అది ముద్దలా మారాక.. ఒక రోజు ఎండలో ఎండబెట్టాలి. ఆ తర్వాత దాన్ని చింతగింజంత మోతాదులో కరోనా వచ్చిన వాళ్లు అయినా.. కరోనా రాని వాళ్లు అయినా రోజుకు రెండు సార్లు.. ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఉదయం పరిగడుపున ఒకటి, సాయంత్రం అంటే రాత్రి భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా రెండు నుంచి మూడు రోజుల పాటు చింతగింజంత మోతాదులో తీసుకోవాలి. ఆ తర్వాత మళ్లీ పది రోజులు గ్యాప్ ఇచ్చి ఒక రోజు మాత్రం రెండు సార్లు తీసుకోవాలి. దీంతో కరోనా ఉన్నవారికి నెగెటివ్ వస్తుంది. కరోనా లేనివారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఈ ఔషధాన్ని వాడే సమయంలో.. వాడిన తర్వాత కొన్ని రోజుల వరకు మాంసాహారం తినకూడదు. సిగిరెట్, మందు తాగకూడదు. పాన్, గుట్కాలు కూడా వేసుకోకూడదు. తంబాకు వాడకూడదు. చిన్నపిల్లలు, బాలింత స్త్రీలు, గర్భిణీలు, బహిష్టు వచ్చిన స్త్రీలు ఈ మందును వాడకూడదు.

గమనిక : ఈ కరోనా మందు తయారు చేసే విధానం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. అయితే.. ఇది అఫిషియల్ అయితే కాదు. అధికారికంగా ఆనందయ్య కానీ.. ప్రభుత్వం కానీ చెప్పలేదు. కాబట్టి.. ఈ మందును తయారు చేసుకోవాలనుకునే వాళ్లు ముందుగా ఆయుర్వదే నిపుణులను సంప్రదించి వాళ్ల సూచనలను తీసుకొని తయారు చేసుకోవాల్సిందిగా మనవి. ఈ మందు తయారు చేసే విధానానికి, thetelugunews వెబ్ సైట్ కు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి రీడర్స్ గమనించగలరు.

గమనిక : ఈ కరోనా మందు తయారు చేసే విధానం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. అయితే.. ఇది అఫిషియల్ అయితే కాదు. అధికారికంగా ఆనందయ్య కానీ.. ప్రభుత్వం కానీ చెప్పలేదు. కాబట్టి.. ఈ మందును తయారు చేసుకోవాలనుకునే వాళ్లు ముందుగా ఆయుర్వదే నిపుణులను సంప్రదించి వాళ్ల సూచనలను తీసుకొని తయారు చేసుకోవాల్సిందిగా మనవి. ఈ మందు తయారు చేసే విధానానికి, thetelugunews వెబ్ సైట్ కు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి రీడర్స్ గమనించగలరు.

ఇది కూడా చ‌ద‌వండి ==> Krishnapatnam Anandayya : ఆనందయ్య మందుపై హైకోర్టు సంచలన కామెంట్స్.. రాష్ట్ర సర్కార్ కు ఆదేశాలు

ఇది కూడా చ‌ద‌వండి ==>Krishnapatnam Anandayya : ఆనందయ్య మందుపై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్?

ఇది కూడా చ‌ద‌వండి ==> Ayurvedic Medicine Formula : ఆయుర్వేద మందు ఫార్ములా విషయంలో హైకోర్టులో ఆనందయ్య పిటిషన్

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది