మళ్లీ రాఘురామకు ఆ పార్టీ నుంచి నరసాపురం టికెట్ ఖాయం..!
raghurama krishnam raju రఘురామకృష్ణంరాజు.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఇప్పుడే కాదు.. గత రెండేళ్ల నుంచి ఆయన గురించే చర్చ. వైఎస్సార్సీపీ పార్టీ నుంచి 2019 లో నర్సాపురం ఎంపీ టికెట్ దక్కించుకొని ఎంపీగా గెలిచి.. ఆ తర్వాత కొన్ని రోజులకే రెబల్ ఎంపీగా మారారు. రెబల్ గా మారడమే కాదు.. అప్పటి నుంచి ఇఫ్పటి వరకు ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ కు ఎన్నో ఇబ్బందులు పెట్టారు.. పెడుతూనే ఉన్నారు. ఢిల్లీలో ఉంటూ.. రఘురామ.. సీఎం జగన్ పై ఎన్నో ఆరోపణలు చేశారు. ఎన్నో విమర్శలు చేశారు. ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూ.. సీఎం జగన్ పై పలు ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచారు రఘురామ. అయితే.. ఇటీవల ఆయన్ను విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ.. రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలతో ఏపీ సీఐడీ అధికారులు రఘురామను అరెస్ట్ చేశారు. ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆయన్ను అరెస్ట్ చేసేసరికి.. ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. సీఎం జగన్ కూడా అదును చూసి రఘురామను మూసేసే ప్రయత్నం చేశారు.
కానీ.. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే.. రఘురామను అరెస్ట్ చేయడం వల్ల ఆయనకు ఏపీ వ్యాప్తంగా సింపథీ పెరిగింది. ప్రతిపక్ష టీడీపీ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా రఘురామ raghurama krishnam raju అరెస్ట్ ను ఖండించాయి. ప్రభుత్వం ఇంత దారుణానికి ఒడిగట్టడమేంటంటూ ప్రశ్నించాయి. అదే రఘురామకు ప్లస్ అయింది. సొంత పార్టీ కాదన్నా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఆయన్ను అక్కున చేర్చుకుంటున్నాయి. ఇప్పటికే ఆయన అన్ని పార్టీలు తిరిగి చివరికి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల సమయంలో తను టీడీపీ నుంచి ఎంపీ టికెట్ వచ్చే పరిస్థితి ఉన్నా కూడా.. వైసీపీలో చేరారు.
రఘురామకు టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ
చంద్రబాబు టికెట్ ఇస్తానన్నా వద్దనుకొని వైసీపీలో చేరి ఎంపీ అయ్యారు రఘురామ. అయినప్పటీకి.. వచ్చే ఎన్నికల్లో రఘురామకు టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రఘురామకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. సీఎం జగన్ ను ఎదిరించిన మొనగాడు.. దమ్మున్న నాయకుడు అనే పేరును కూడా రఘురామ సంపాదించుకున్నాడు. అటువంటి నాయకుడికి టికెట్ ఇవ్వడానికి మేం రెడీ అంటూ టీడీపీ, బీజేపీ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. టీడీపీ అయితే ఫస్ట్ నుంచీ రఘురామకు సపోర్ట్ చేస్తూనే ఉంది. ఈ విషయం జగన్ కు మింగుడుపడటం లేదట. ఎందుకంటే రాజకీయంగా రఘురామ raghurama krishnam raju ను భూస్థాపితం చేయాలని జగన్ భావించారని.. కానీ.. రఘురామకు అదే నర్సాపురం నుంచి టికెట్ ఇవ్వడానికి ప్రతిపక్ష పార్టీలు సిద్ధం అవుతుండటంతో వైసీపీ హైకమాండ్ ఆందోళనలో పడిందట.