ఏ క్షణమైనా మూడు రాజధానులు సంచలన వ్యాఖ్యలు చేసిన బొత్స , విజయసాయిరెడ్డి
botsa satyanarayana బొత్స సత్యయనారాయణ ఈ రోజు తాడేపల్లిలో మీడియాలో మాట్లాడుతూ అన్నీ ప్రాంతాలు అభివృద్దే సీఎం జగన్ లక్ష్యం అని పేర్కొన్నారు. అందుకే మూడు రాజధానులపై చట్టం చేశామని బొత్స సత్యయనారాణ botsa satyanarayana తెలిపారు. అయితే ఈ చట్టం ఎప్పటి నుండి ప్రారంభం అవుతుందో బొత్స తెలిపారు. ఏ రోజైనా, ఏ క్షణమైనా అమలు కావచ్చని ఆయన స్పష్టం చేశారు. మరో పక్క రాజధాని తరలింపుకు సీఆర్‌డీఏ కేసులకు ఎటువంటి సంబంధం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
ఎంపీ విజయసాయిరెడ్డి vijayasai reddy బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ అతి తర్వలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని స్పష్టం చేశారు. త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని నుండి పరిపాలన సాగుతుందని ఆయన తెలిపారు. అయితే సీఎం జగన్ ఎక్కడి నుండైనా పరిపాలన చేయెచ్చని విజయసాయిరెడ్డి vijayasai reddy పేర్కొన్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్ నుండి పాలన సాగించిన విషయం గుర్తు చేశారు. అయితే విశాఖ కేపిటల్ పాలన ఎప్పటి నుండి ప్రారంభం అవుతుందో ఆయన స్పష్టంగా చెప్పలేదు.
విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని పనులు ప్రారంభం
అయితే విశాఖ కేపిటల్ పనులు శర వేగంగా జరుగుతున్నాయని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో వైస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానుల అంశంను తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. లెజిస్లేటివ్ రాజధాని అమరావతి , విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటిల్‌గా, జ్యూడీషీయల్ రాజధానిగా కర్నూల్ కొనసాగుతుందని సీఎం జగన్ ప్రకటించాడు. రాజధానుల అంశం రాష్ట్రాల ఇష్టం అని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై విపక్షాలు వ్యతిరేకించడం జరిగింది. రాజధానిని తరలించోద్దు అని రైతు ఆందోళనలు చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే.