ఆనందయ్య కంట్లో వేసే మందు రిపోర్ట్ వచ్చింది.. సైడ్ ఎఫెక్ట్స్ లేవు కానీ..!
Anandaiah Eye Drops ఆనందయ్య కంట్లో వేసే చుక్కల మందుపై నిపుణుల కమిటీ 8 పరీక్షలు నిర్వహించి ఆ నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ రిపోర్ట్‌లో చుక్కల మందుపై దుష్రభావాలు లేవని నివేదికలో పేర్కొన్నారు. కానీ.. ఆనందయ్య కంట్లో వేసే చుక్కల మందు Anandaiah Eye Drops తగిన ప్రామాణికాలు లేవని తేల్చి చెప్పింది. ప్రమాణలకు అనుగుణంగా ఆనందయ్య ఇచ్చే కంట్లో వేసే మందు లేదని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.
Anandaiah Eye Drops ఆనందయ్య కంట్లో వేసే మందు ఇలా ఉండవద్దు
ఆనందయ్య కంటో ఇచ్చే మందు Anandaiah Eye Drops కలర్ ఉందని, కంట్లో వేసే మందు ఎలాంటి రంగులు ఉండొద్దని నిపుణుల కమిటీ తెలిపారు. కంట్లో వేసే మందును ఎనిమిది రకాల పరీక్షలు నిర్వహించాం అని వాటిలో ఏమీ గుర్తించలేదని కమిటీ చెప్పింది. కంట్లో వేసి మందు తయారీ , నిల్వ విదానంలో మార్పులు చేయాలి. మందును గాజు లేదా మందులు నిల్వ చేసే పాత్రల్లో ఉంచాలని స్పష్టం చేసింది. ల్యాబ్ లేదా కోజ్డ్ ఏరియాల్లో మందును తయారు చేయాలి, నిర్దేశిని ప్రమాణాల్లో తయారు చేశాక దానిని స్టెరైల్ టెస్ట్ చేయగలగాలని కమిటీ పేర్కొంది.
కె. అనే మందు ఎటువంటి హానికరం కాదని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. కాగా ఆనందయ్య కంట్లో వేసే మందు అనుమతుల కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆయన ఇచ్చిన ఫిటిషన్ ఈ రోజు (గురువారం ) హైకోర్టు లో విచారణ జరిపింది. కంట్లో వేసే మందును పరీక్షలు నిర్వహించామని కోర్టుకు స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం కోర్టులో ఆ మందుకు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పండి. ఇరు వర్గాల వాదనను విని కోర్టు తీర్పును రిజ్వర్ చేసింది.