YS Jagan : బ్రేకింగ్ : డిల్లీకి వైఎస్ జగన్..!
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న కీలక సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ఈసందర్భంగా ఏపీకి సంబంధించిన సమస్యలు, డిమాండ్లపై ఆయన మరోసారి తన గళాన్ని వినిపించనున్నారు. విభజన సమస్యలు ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు. వాటిపై సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించనున్నారు. ఇప్పటి వరకు ప్రత్యేక హోదా రాలేదు. అలాగే.. పోలవరం నిధులు, ఇతర నిధులు అన్నింటిపై జగన్ కేంద్రాన్ని ప్రశ్నించనున్నారు.
నిజానికి వచ్చే సంవత్సరం ఈ సమయం కల్లా ఎన్నికలు ఉన్నాయి. ఈనేపథ్యంలో సీఎం జగన్ కేంద్రం వద్ద రాష్ట్ర సమస్యలపై తన గళాన్ని గట్టిగానే వినిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఈ సమావేశం ఈనెల 27న జరగనుంది. నీతి ఆయోగ్ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. ముఖ్యమంత్రులకు వీలు కాకపోతే ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరవుతారు. నీతి ఆయోగ్ మీటింగ్ కోసం సీఎం జగన్ ఈనెల 26న ఢిల్లీ బయలుదేరుతారు. అదే రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుస్తారు. ఆ తర్వాత 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొంటారు.
YS Jagan : ప్రధాని మోదీతోనూ సమావేశం
నీతి ఆయోగ్ సమావేశం ముగిశాక.. సీఎం జగన్ ప్రధాని మోదీతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలపై ఆయన కేంద్రం దృఫ్టికి తీసుకెళ్లనున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ తీసుకొని ఆయనతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి కూడా సీఎం కేసీఆర్ హాజరు అయ్యే అవకాశం ఉంది. నిజానికి ఉమ్మడి ఏపీ విడిపోయి 10 ఏళ్లు కావొస్తోంది కానీ.. ఇప్పటి వరకు విభజన సమస్యలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విభజన సమస్యలను కూడా కేంద్రం స్పీడప్ చేయడం లేదు. ఆ సమస్యలను వేగవంతం చేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్రాన్ని సీఎం జగన్ కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.