YSR Pension KANUKA : నెల మొదలవ్వకుండానే పింఛన్‌.. ఇదెక్కడా చూడలే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YSR Pension KANUKA : నెల మొదలవ్వకుండానే పింఛన్‌.. ఇదెక్కడా చూడలే!

 Authored By prabhas | The Telugu News | Updated on :3 May 2022,7:00 am

YSR Pension KANUKA : భారతదేశంలో ప్రతీ రాష్ట్రంలో కూడా వయో వృద్ధులకు వికలాంగులకు ప్రభుత్వం పింఛన్ ను ఇస్తున్న విషయం తెలిసిందే. ఒకొక్క రాష్ట్రంలో ఒకొక్క విధంగా ఈ పింఛన్ అనేది లబ్ధిదారులకు ఇస్తున్నారు. అయితే ఎక్కువ రాష్ట్రాల్లో పింఛన్ అనేది 5 నుండి 10 వ తారీకు మధ్యలో ఇస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మొదటి తారీకు లోనే అది కూడా ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో మే ఒకటో తారీకు కాకుండానే అంటే అంతకు ముందు రోజే ఏప్రిల్ 30 తారీఖు లోనే పింఛన్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఏప్రిల్ 29, 30 వ తారీకు లో ప్రభుత్వ ఖజానా నుండి వాలంటీర్ల వద్ద కి డబ్బు వెళ్ళింది.

వారు ఒకటో తారీకు ఉదయం నుండి ఇంటింటికి తిరిగి పింఛన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కొన్ని చోట్ల 30 వ తారీకు రోజున వాలంటీర్లు వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఇలా నెల ప్రారంభం కాకముందే పెన్షన్ ఇవ్వడం అనేది ఎక్కడా జరగదని కేవలం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన లో మాత్రమే ఇలా జరుగుతుందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒకటో తారీకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పింఛన్ ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు ఇవ్వడాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కూడా ఎక్కడా అమలు భారీ మొత్తం పింఛన్ ని కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్న విషయం తెలిసిందే.

ap government YSR Pension KANUKA

ap government YSR Pension KANUKA

ఇప్పుడు ఈ నెల ప్రారంభం కాకముందే పింఛన్ ఇచ్చి మరో సారి వార్తల్లో నిలిచారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వయోవృద్దులు మరియు దివ్యాంగుల పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలియ చేయకుండా ఉండలేకపోతున్నా మంటున్నారు. ఒకప్పుడు పింఛన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి ఉండేది.. కానీ ఇప్పుడు ఒకటో తారీకు రాకముందే పింఛన్ చేతికి వస్తున్న నేపథ్యంలో జగన్ను దేవుడంటూ స్థానికులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కానీ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నేపథ్యంలో ఆయన మళ్లీ సీఎం కావాలని స్వయంగా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లుగా ఒక సర్వేలో వెల్లడైంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది