Pension Rs.3000 : గుడ్ న్యూస్.. పింఛన్ రూ. 3000 పెంచిన ప్రభుత్వం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pension Rs.3000 : గుడ్ న్యూస్.. పింఛన్ రూ. 3000 పెంచిన ప్రభుత్వం…!

 Authored By anusha | The Telugu News | Updated on :1 January 2024,4:02 pm

ప్రధానాంశాలు:

  •  Pension Rs.3000 : గుడ్ న్యూస్.. పింఛన్ రూ. 3000 పెంచిన ప్రభుత్వం...!

Pension Rs.3000 : ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ. 250 పెంచుతూ పెన్షన్ మొత్తాన్ని 3000 పెంచారు. ఈ పెంచిన మొత్తాన్ని జనవరి నెల నుంచి అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ కూడా ప్రారంభమైంది. వైసీపీ అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తాన్ని 3 వేల రూపాయలకు పెంచుతానని వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఏడాదికి రూ. 250 పెంచుతూ ఐదేళ్లలో ఆ మొత్తాన్ని మూడు వేలకు పెంచి ఇచ్చిన మాటను నిలబెట్టు కున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తుంది. పింఛన్ లబ్ధిదారుల అభిప్రాయంతో ప్రత్యేక వీడియోలను రూపొందించి ట్రోల్ చేస్తుంది.

2019 ఎన్నికల నాటికి సామాజిక పింఛన్లు రూ. 1000 చొప్పున అందించేవారు. తాను గెలిస్తే రూ. 2000 పెంచుతానని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే పాదయాత్ర చేసి నవరత్నాలను రూపొందించిన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏకంగా పింఛన్ మొత్తాన్ని 3 వేల రూపాయలకు పెంచుతానని హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు జగన్ ను నమ్మారు. వైసీపీని ఆదరించి ఎన్నికల్లో గెలిపించేలా చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వై.యస్.జగన్మోహన్ రెడ్డి పింఛన్ మొత్తాన్ని రూ. 2250 పెంచారు. ఆ తర్వాత సంవత్సరం రూ. 2500 కు పెంచారు. గత ఏడాది రూ. 2750 చేశారు. ఇప్పుడు 3000లకు చేసి అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల నుంచి పంపిణీ కూడా ప్రారంభించారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు ఉండడంతో దీనిని ఒక ప్రచార అస్త్రంగా వాడుకోవాలని వైసీపీ భావిస్తుంది.

జనవరి ఒకటి నుంచి 8 రోజులపాటు పెన్షన్ల పెంపు ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది 8 రోజులపాటు ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసింది కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో ఈనెల 3న జరిగే వేడుకల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు కాదా పెన్షన్ల పెంపు పై వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తుంది పండుటాకులు ఒంటరి మహిళలు వితంతువులు ఏ ఆదరణ లేని మహిళ వాయిస్ తో కూడిన వీడియోలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంది ఇవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి మొత్తానికైతే పెన్షన్లను పెంచి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార అస్త్రంగా వాడుకుంటుంది.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది