Pension : ఏపీలో పింఛన్ దారులకు గుడ్ న్యూస్.. జూన్ నెలలో ఆ విధంగా ఇస్తారంట..!
Pension : ఏపీలో ఇప్పుడు పింఛన్ల విషయం హాట్ టాపిక్ అవుతోంది. వాస్తవానికి అంతకు ముందు పింఛన్లకు ఎలాంటి సమస్య ఉండేది కాదు. ఎందుకంటే సీఎం జగన్ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు. దాంతో వారంతా ఇండ్లకే వెళ్లి పింఛన్లను ఇచ్చేవారు. అలా పింఛన్ దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి. కానీ ఎన్నికల సమయంలో వాలంటీర్లతో పిఛంన్లు ఇవ్వొద్దంటూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు రావడంతో అధికారులు దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. వాలంటీర్లతో పింఛన్లు ఇవ్వొద్దంటూ ఎన్నికల కమిషన్ ఆర్డర్ వేసింది.
Pension ముగిసిన పోలింగ్..
దాంతో ఏప్రిల్ నెలలో గ్రామ సచివాలయాలలో పింఛన్లు ఇచ్చారు. ఆ సమయంలో వృద్ధులు, వికలాంగులు పింఛన్ల కోసం పడిగాపులు కాశారు. చాలా మంది ఎండ వేడిని తట్టుకోలేక మరణించారు. ఆ దెబ్బతో ప్రభుత్వం వెంటనే అలెర్ట్ అయిపోయింది. ఎన్నికల కమిషన్ ను రిక్వెస్ట్ చేసి మే నెలకు సంబంధించిన పింఛన్లను అకౌంట్లలో వేశారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. కానీ ఇంకా కోడ్ కొనసాగుతోంది. ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి జూన్ నెలకు సంబంధించిన పింఛన్లు ఎలా ఇస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. దానిపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
జూన్ నెల పింఛన్లను నేరుగా వారి అకౌంట్లలోనే వేస్తామని తెలిపింది ప్రభుత్వం. గత నెల మాదిరిగానే వేస్తామని చెప్పింది. అయితే నడవలేని వికలాంగులు, వృద్ధులు, ఇతర వ్యాధులతో ఇబ్బందులు పడే వారికి మాత్రం ఇంటి వద్దకే వెళ్లి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇందుకోసం ఇప్పటికే అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే గత నెలలో కొంత మంది పింఛన్ దారులు బ్యాంకు ఖాతా వివరాలు విషయంలో ఇబ్బందులు పడ్డారు. కొందరికి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడలేదని వాపోయారు. అలాంటి వారి విషయంలో ఈసారి ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. కాగా ఆ విషయం మీద ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం అయితే రాలేదు. మరి వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.