Ys Jagan : వైఎస్ జగన్ ఘనతకు ప్రత్యక్ష సాక్ష్యం ప్రభుత్వ స్కూల్ లో ఐఏఎస్ పిల్లలు
Ys Jagan : ఏ దేశంలో అయినా రాష్ట్రంలో అయినా విద్యా ఆరోగ్యం అద్భుతంగా ఉంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంను లేదా దేశంను అభివృద్ది చెందినట్లే అనడంలో సందేహం లేదు. దేశ వ్యాప్తంగా విద్యా వ్యవస్థ కమర్షియల్ అయ్యింది. ఆరోగ్యం కార్పోరేట్ వ్యవస్థగా మారింది. లక్షలు ఖర్చు చేస్తేనే మెరుగైన విద్య.. లక్షలు ఖర్చు చేస్తేనే వైద్యం అన్నట్లుగా పరిస్థితి ఉంది. కాని ఏపీలో మాత్రం పేదల నుండి ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన విద్య మరియు ఆరోగ్య సేవలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. మెరుగైన విద్యను అందించడం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రంను నిర్వహించిన విషయం తెల్సిందే.
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలకు నాడు నేడు కార్యక్రమం ద్వారా అద్బుతమైన ప్రయోజనం చేకూరింది. రాష్ట్రంలోని మెజార్టీ స్కూల్స్ లో మౌళిక వసతులు మెరుగు పడటం మొదలుకుని ఎన్నో రకాలుగా అభివృద్ది సాధ్యం అయ్యింది. అందుకే ప్రైవేట్ స్కూల్స్ కు ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ పాఠశాలలు కూడా నడుస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో మంది ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం ద్వారా జగన్ సాధించిన ప్రగతి కనిపిస్తుంది. జగన్ ఘనతకు ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా ఐఏఎస్ పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యారు. ఐఏఎస్ ఆఫీసర్ శాప్ ఎండీ ఎన్.
ప్రభాకరరెడ్డి తన ఇద్దరు పిల్లలను విజయవాడ లోని కోనేరు బసవపున్నయ్య జెడ్పీ హైస్కూల్‌లో చదివించేందుకు సిద్ధం అయ్యారు. ఆయన భార్య లక్ష్మి తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అద్బుతంగా పని చేస్తున్నాయి. అందుకే ఈ స్కూల్ లో జాయిన్ చేయలని నిర్ణయించుకున్నామని లక్ష్మి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ ను మించి ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దడంలో ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది అంటూ ఇటీవల పలువురు ఉన్నతాధికారులు కూడా అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.