Ap Politics : ఏపీలో ముదురుతున్న ట్విట్టర్ వివాదం.. అంబటి రాంబాబు వర్సెస్ అయ్యన్న పాత్రుడు.. ఎవ్వరూ తగ్గట్లేదుగా..
Ap Politics : ట్విట్టర్ లో ఏపీ నేతల మధ్య పెద్ద వార్ కొనసాగుతోంది. రాజకీయంగా మొదలైన వివాదం వ్యక్తిగతంగా దూషించుకునే వరకు వెళ్లింది. ఏపీ మంత్రి రాంబాబు, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మధ్య మాజీ మంత్రి నారాయణ అరెస్టు విషయంలో ముదిరి తీవ్రస్థాయికి చేరుకుంది. వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ తగ్గేదేలా అంటున్నారు. ఎంతదూరమైనా చూసుకుందాం.. అనేలా మాటల యుద్దం మొదలుపెట్టారు. మొదట అంబటి రాంబాబు నారాయణ అరెస్టు విషంయలో ట్వీట్ చేయగా.. అయ్యన్న కాంబాబు.. అంటూ స్టార్ట్ చేశాడు.
అందుకు రాంబాబు కూడా గట్టిగానే కౌంటర్ వేశాడు.టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు కౌంటర్ ఇస్తూ ఇంటర్వ్యూ కావాలని ఓ యాంకర్ కాంబాబుకి వాట్సాప్ లో మెసేజ్ పెడితే ఇంటర్వ్యూ ఇస్తా నాకేం ఇస్తావ్ అని మెసేజ్ చేశాడని, అన్ని ఆధారాలతో బయట పెడతామని అయ్యన్న మరో ట్వీట్ చేశాడు. విషయం తెలుసుకుని అంబటి మనుషులు ఆ యాంకర్ కి ఫోన్ చేసి సారీ చెప్పి మెసేజ్ లు డెలిట్ చేయాలని వేడుకున్నట్లు విమర్శించారు. త్వరలోనే సదరు యాంకర్ సీఎంను కలబోతోందని.. ఇక నీ సంగతి అంతే అనేలా మరో ట్వీట్ చేశాడు.
Ap Politics : ఇంటర్వ్యూ అడిగితే ఏం ఇస్తావ్ అంటాడా.. అయ్యన్న
అయితే ఈ వార్ ఈ ఇద్దరి మధ్యే కాకుండా వైసీపీ, టీడీపీ నేతల మధ్య కూడా నడుస్తోంది. కాగా అంబటి ఏదో చేస్తానని చెప్పి ట్విటర్ లో మొరుగుతూ సైడ్ అయిపోయాడంటూ మరో ట్వీట్ చేశాడు. దీంతో అయ్యన్న ఆధారాల కోసం కాస్త లేటైందన్నట్లు ఓ ఆడియోను పోస్టు చేశాడు. ఇలా ట్విట్టర్ ల మీద ట్టిట్టర్ లు పెడుతూనే ఉన్నారు. చివరకి ఈ రాసలీల ముచ్చట్లు ఎక్కడ ఆగనున్నాయో అర్థం కావడంలేదు.. ఈ ఇష్యూ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ ఇష్యూలో ఇద్దరి నేతల అధినేతలు స్పందిస్తారా.. లేక సద్దుమణిగేలా చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.