YS Jagan : అమ్మలకు గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్ కేబినెట్‌.. ఆ నిధుల విడుదలకు డేట్ ఫిక్స్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : అమ్మలకు గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్ కేబినెట్‌.. ఆ నిధుల విడుదలకు డేట్ ఫిక్స్‌

 Authored By prabhas | The Telugu News | Updated on :25 June 2022,7:30 pm

YS Jagan : ఏపీ సీఎం జగన్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మ ఒడి పథకంకు సంబంధించిన నిధులను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అంటూ అమ్మలు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలోనే అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థిని విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడికి సంబంధించిన నగదు ను ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ అమౌంట్ కు సంబంధించిన గుడ్ న్యూస్ ను ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి ప్రతి ఒక్కరి కళ్లలో ఆనందం కనిపించేలా చేసింది. నిన్న జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రి వర్గ సమావేశం జరిగింది.

రాష్ట్ర కేబినేట్‌ సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.ఏపీ రాష్ట్ర మంత్రులు మరియు ముఖ్యమంత్రి ఆ సమావేశంలో అమ్మ ఒడి నిధులకు సంబంధించిన చర్చ కార్యక్రమం ను నిర్వహించడంతో పాటు ఎప్పుడు ఆ నిధులు వేయాలి.. కొత్త అర్హులను ఎలా జాయిన్‌ చేయాలి అనే విషయాలను గురించి చర్చించడం జరిగిందట. కేబినేట్ సమావేశం పూర్తి అయిన తర్వాత సంబంధిత మంత్రి మాట్లాడుతూ ఈనెల 27 నుండి అమ్మ ఒడి నిధుల విడుదల ఉండబోతుందన్నారు. రాష్ట్ర కేబినేట్‌ మీటింగ్ లో ఇంకా పలు ఆసక్తికర అంశాల గురించి చర్చలు జరిపారట.

ap YS Jagan cabinet green signal to release amma vodi funds

ap YS Jagan cabinet green signal to release amma vodi funds

కోనసీమ జిల్లా పేరును మార్చడం పట్ల పెద్ద ఎత్తున ఆందోళనలు వచ్చిన నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారని అంతా భావించారు. కాని తాజా కేబినేట్ మీటింగ్‌ లో జగన్ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే నెలలో జగనన్న విద్యా కానుక, కాపు నేస్తం, జగనన్న తోడు, వాహన మిత్ర పథకాలకు నిధులను విడుదల చేసేందుకు గాను మంత్రి వర్గ సమావేశంలో ఆర్థిక వెసులుబాటుకు, నిధుల విడుదలకు సంబంధించి అనుమతులు జారీ చేయడం జరిగింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది