Iphone 14 : ఐఫోన్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఐఫోన్ 14 లాంచ్ అయ్యేది ఎప్పుడంటే…!
Iphone 14 : ప్రతి ఒక్కరికి ఐఫోన్ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఐఫోన్ వాడాలని చాలా మంది కలలుకంటుంటారు. ఐఫోన్ సరికొత్త ఫీచర్స్‌తో ఎప్పటికప్పుడు సరికొత్తగా అందుబాటులోకి వస్తుంటుంది. ఐఫోన్ తదుపరి సిరీస్ తీసుకొచ్చేందుకు పాపులర్ బ్రాండ్ యాపిల్ సిద్ధమైంది. ఐఫోన్ 13 సిరీస్ తో పోలిస్తే నయా మొబైళ్లు ఎక్కువ అప్‌గ్రేడ్‌లతో వస్తాయని అంచనాలు ఉన్నాయి. దీంతో ఐఫోన్ లవర్స్.. 14 సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐఫోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 14 , ఐఫోన్ 14 ప్రో , ఐఫోన్ 14 మ్యాక్స్ , ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లాంచ్ అవుతాయని తెలుస్తోంది.
Iphone 14 : కొత్త ఫీచర్స్ తో..
చైనా, తైవాన్‌ల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఐఫోన్ 14 ఆలస్యంగా రానుందని పుకార్లు షికార్లు చేశాయి. దీనికి కారణం చైనాలో తయారయ్యే యాపిల్ ఫోన్లలో ఉపయోగించే చిప్స్ ఎక్కువ శాతం తైవాన్‌లో తయారు కావడమే. వచ్చే నెలలోనే ప్రపంచవ్యాప్తంగా కొత్త ఫోన్ రిలీజ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీని ఐఫోన్ 14 లాంచ్ కానున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్ మాక్స్ వైన్‌బాచ్ వెల్లడించారు. అయితే భారత్‌లో మాత్రం సెప్టెంబర్ 16 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఐఫోన్ 14 ప్రారంభం ధర మన కరెన్సీలో రూ. 63,395 కాగా, 14 ప్రో రూ. 87,191, ప్రో మ్యాక్స్ ధర రూ. 95,131 ఉండనున్నట్లు సమాచారం. ఐఫోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్స్.. యాపిల్ బయోనిక్ 16 చిప్‌తో రానున్నాయి. అయితే ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్ 13 సిరీస్‌లో ఉండే బయోనిక్ ఏ15 ప్రాసెసర్‌తోనే లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. అయితే కొత్త సెల్యూలార్ మోడెమ్, ఇంటర్నల్ డిజైన్‌తో పాటు మిగిలిన అప్‌గ్రేడ్ల కారణంగా మెరుగైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. భారత్‌కు వచ్చేసరికి ఐఫోన్‌ల ధరలు ఎక్కువగా ఉంటాయి. లాంచ్ అయిన సమయంలో ఐఫోన్ 13 ప్రారంభ ధర ఇండియాలో రూ.79,000గా ఉండేది. దీంతో ఐఫోన్ 14 కూడా దాదాపు ఇదే రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.