Apple Seeds | యాపిల్ గింజల్లో దాగి ఉన్న విషం .. డాక్టర్ల హెచ్చరికలు
Apple Seeds | “రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దూరంగా ఉంటాడు” అనే నానుడి మనందరికీ తెలిసినదే. కానీ ఆ యాపిల్ తినేటప్పుడు అందులోని గింజలను తీసేయకపోతే ఏమవుతుందో తెలుసా? తాజాగా జరిగిన శాస్త్రీయ పరిశోధనల్లో యాపిల్ గింజల్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లు తేలింది.
#image_title
గింజల్లో ఉన్న ‘అమిగ్డాలిన్’
శాస్త్రవేత్తల ప్రకారం, యాపిల్ గింజల్లో అమిగ్డాలిన్ (Amgdalin) అనే రసాయనం ఉంటుంది. ఇది మన శరీరంలోకి వెళ్లిన తర్వాత హైడ్రోజన్ సైనైడ్గా మారుతుంది. ఇది శరీరానికి హానికరమైన విషపదార్థం. చిన్న మొత్తంలో తీసుకున్నా తలనొప్పి, అలసట, గందరగోళం, నీరసం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2015లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం, ఒక్క గ్రాము యాపిల్ గింజల్లో సుమారు 1 నుండి 4 మిల్లీగ్రాముల అమిగ్డాలిన్ ఉంటుంది. ఇది 0.6 మిల్లీగ్రామ్ హైడ్రోజన్ సైనైడ్‌కి సమానం.
అంటే, ఒక వ్యక్తి 80 నుండి 500 యాపిల్ గింజలు తింటే ప్రాణాపాయం సంభవించవచ్చు.యాపిల్ మాత్రమే కాదు, బాదం, ఆప్రికాట్, పీచ్, చెర్రీలు వంటి రోసేసి కుటుంబానికి చెందిన పండ్ల విత్తనాల్లో కూడా అమిగ్డాలిన్ అధికంగా ఉంటుంది. ఈ విత్తనాలను నమిలి తింటే సైనైడ్ విడుదల అవుతుంది.