Sewing Machine : ఉచితంగా కుట్టు మిషన్ కావాలా.. ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు అప్లై చేసుకోండి..!
Sewing Machine : ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రజల దగ్గరకు చేరకుండానే కొన్ని ఉండిపోతున్నాయి. ఆర్ధికంగా వెనకపడ్డ వారి కోసం ప్రభుత్వం రకరకాల పథకాలను ప్రవేశ పెడుతుంది కానీ వాటిని ప్రజల దాకా తీసుకెళ్లేవి చాలా తక్కువ ఉంటాయి. ముఖ్యంగా మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు మంచి స్కీంస్ ని ప్రవేశ పెడతాయి. కేంద్ర ప్రభుత్వం వీరి కోసం అనేక పథకాలు అందిస్తుంది. కొత్తగా ఒక మంచి పథకం అందిస్తుంది. దీని ద్వారా 3 లక్షల దాకా రుణ సౌకర్యం ఇస్తుంది. మహిళలు దీన్ని సద్వినియోగ పరచుకోవడం మంచిది.
ప్రభుత్వాలు మహిళలకు అండగా నిలిచి వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేస్తాయి. అందుకే స్వయం ఉపాది పథకాలను ప్రవేశ పెడుతుంటారు. ఈ పథకాల్లో ప్రభుత్వం కుట్టు మిషన్లు కొనేందుకు డబ్బు ఇచ్చే పథకం కూడా ఉంది. దీనికి ఇప్పటికే అప్లికేషన్ లు తీసుకుంటున్నారు. మహిళలు ఆర్ధికంగా సాధికారత సాధించేలా కేంద్ర ప్రభుత్వం ఈ కుట్టు మిషన్ల ఉచిత పంపిణీ అమలు చేస్తుంది. దీని ద్వారా వారు సొంత వ్యాపారం ప్రారంభించేందుకు 5 లక్షల రుణ సౌకర్యం ఇస్తున్నారు. ఇది కచ్చితగా మహిళలకు ప్రయోజనం చేకూర్చేలా ప్రధాని మోడీ ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన ద్వారా ఈ పథకం అందుబాటులో ఉంది.
కుట్టు మిషన్ పొందాలంటే ప్రభుత్వం 1500 అందిస్తుంది. ఈ రుణం పొందాలంటే తప్పనిసరిగా వారు టైలరింగ్ నేర్చుకోవాలి. అంతేకాదు అదే రంగంలో వ్యాపారం చేయాలనుకునే వారికి 3 లక్షల దాకా రుణ సౌకర్యం అందిస్తారు. విశ్వకర్మ యోజన పథకం ప్రయోజనాలు.. దరఖాస్తు దారులు కుట్టు మిషన్ కోసం 15000 అందిస్తుంది. నైపుణ్య శిక్షణ కూడా ఇస్తారు. నైపుణ్య శిక్షణ కోసం రోజుకు 500 స్టైఫండ్ కూడా అందిస్తారు. సొంత వ్యాపారానికి 3 లక్షల వరకు రుణం అందిస్తారు. దీని కోసం అప్లై చేసే వారు రేషన్ కార్డ్, కాస్ట్ సర్టిఫికెట్, ఇన్ కం సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, పాస్ పోర్ట్ సైజు ఫోటో, వృత్తిపరమైన లైసెన్స్ ఉండాలి.