YS Jagan : జండా పీకేసిన టీడీపీ జనసేన.. జగన్ మామూలోడు కాదు
YS Jagan : ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా మునుగోడు ఎన్నికల గురించే చర్చ. మునుగోడు ఉపఎన్నికలో ఎవరు పోటీ చేస్తారు.. ఎవరు చేయరు అనేదానిపైనే చర్చ నడుస్తోంది. మరోవైపు మునుగోడు ఉపఎన్నిక కోసం ప్రధాన పార్టీలన్నీ ప్రచారం మొదలుపెట్టేశాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే అక్కడే పాగా వేసి.. మునుగోడులో ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. ఇక.. తెలంగాణలోనూ యాక్టివ్ గా ఉన్నాం అని చెప్పుకునే టీడీపీ కానీ.. జనసేన కానీ.. మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేయడం లేదు.
అయితే.. తెలంగాణలో యాక్టివ్ గా ఉన్నామని, అక్కడ కూడా రాజకీయాలు చేస్తామని చెప్పుకుంటూ వచ్చిన ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో మాత్రం పోటీ చేయడం లేదు. దానికి కారణం ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు. ఎందుకంటే.. వీళ్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఫేస్ చేయలేకపోతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు కానీ.. వాళ్లకు టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అడ్డొస్తున్నాయి. 2018 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో ఏ ఎన్నికల్లోనూ టీడీపీ, జనసేన పోటీ చేయలేదు. ఇప్పుడు మునుగోడులోనూ పోటీ చేయడం లేదు. తెలంగాణలో పోటీ చేయడం అంటే టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఎదురెళ్లడం లాంటిదే కదా. కేసీఆర్ ఏమో కానీ.. బీజేపీకి ఎదురు వెళ్లడం అంటే..
YS Jagan : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ది ఒకే సమస్యా?
నరేంద్ర మోదీనే టార్గెట్ చేసినట్టు అవుతుంది. అసలే ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఓవైపు టీడీపీ చూస్తోంది. మరోవైపు జనసేన.. బీజేపీతో పొత్తులో ఉన్నట్టుగానే ఉంటోంది. ఈనేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా అక్కడ పోటీ చేయడం అవసరమా అన్న ఆలోచనలో రెండు పార్టీలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది తన శిష్యుడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు ఏం చేయగలడు. పవన్ కళ్యాణ్ కూడా కాంగ్రెస్ పార్టీపై విమర్శించే పరిస్థితిలో ఇప్పుడు లేరు. అందుకే.. మునుగోడు ఉపఎన్నిక నుంచి రెండు పార్టీలు తప్పుకున్నట్టు తెలుస్తోంది. అంటే.. రెండు పార్టీలు తెలంగాణ నుంచి జెండాలు పీకేసినట్టేనా. ఇప్పుడే పోటీ చేయని వాళ్లు.. రేపు సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు.