అశ్విన్ సెంచరీ.. ఇంగ్లండ్ టార్గెట్ 482..
చెన్నైలో జరుగుతున్న 2వ టెస్టు 3రోజు భారత బ్యాట్స్‌మెన్ విజృంభించారు. స్పిన్ బౌలర్ అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో మరో సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో అశ్విన్‌కు ఇది 5వ సెంచరీ. కాగా 3వ రోజు భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 286 పరుగుల వద్ద ముగించింది. ఈ క్రమంలో భారత బ్యాట్స్‌మెన్ ఆలౌట్ అయ్యారు. ఇంగ్లండ్‌పై భారత్‌కు 481 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 482 పరుగుల స్కోరు చేయాల్సి ఉంది.
మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 329 పరుగులకు ఆలౌట్ అవగా అనంతరం బ్యాటింగ్ చేపట్టన ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 134 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అశ్విన్ స్పిన్ మాయాజాలంతో వికెట్లు తీశాడు. అలాగే సెంచరీ చేసి కూడా రాణించాడు. దీంతో భారత్ కు భారీ ఆధిక్యం లభించింది.
ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్, మొయిన్ అలీలకు చెరో 4 వికెట్లు దక్కాయి. ఆల్లీ స్టోన్ 1 వికెట్ తీశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 161 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ (106), కోహ్లి (62)లు రాణించారు.