Ashwin : బిగ్ బ్రేకింగ్‌.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ఆర్ అశ్విన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ashwin : బిగ్ బ్రేకింగ్‌.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ఆర్ అశ్విన్..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 December 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Ashwin : బిగ్ బ్రేకింగ్‌.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ఆర్ అశ్విన్..!

Ashwin  : ఇటీవ‌ల చాలా మంది ప్లేయ‌ర్స్ ఇంటర్నేష‌న‌ల్ క్రికెట్‌కి గుడ్ బై చెబుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇండియ‌న్ ప్లేయ‌ర్స్ కూడా ఒక్కొక్క‌రుగా త‌ప్పుకుంటున్నారు.ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్‌ అనంతరం అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. అయితే గ‌బ్బా వేదిక‌గా అశ్విన్ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి ఆటగాళ్ళను బెంబేలెత్తించిన రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించారు… ఈ మేరకు బిసిసిఐ వెల్లడించింది. ఇప్పటి వరకు భారత టెస్టు చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకడిగా పేరుగాంచాడు. ఈ టూర్‌లో అతనికి ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం లభించింది.

Ashwin బిగ్ బ్రేకింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ఆర్ అశ్విన్

Ashwin : బిగ్ బ్రేకింగ్‌.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ఆర్ అశ్విన్..!

Ashwin  అశ్విన్ గుడ్ బై..

అడిలైడ్ తర్వాత, అతను గబ్బా టెస్టుకు దూరమయ్యాడు. గబ్బా టెస్టు సందర్భంగా అశ్విన్ టీమిండియా ఆటగాళ్లను కౌగిలించుకుంటూ కనిపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని కౌగిలించుకున్నాడు. అశ్విన్ కూడా హెడ్ కోచ్ గంభీర్‌తో చాలాసేపు మాట్లాడి, ఆపై విలేకరుల సమావేశానికి వచ్చి రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న అశ్విన్.. తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. ఈ సమయంలో అశ్విన్ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. పెర్త్ టెస్ట్ విజయం తర్వాతే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నాడని, కానీ కెప్టెన్ రోహిత్ పింక్ బాల్ టెస్ట్ ఆడేలా కన్విన్స్ చేసినట్లు తెలిపాడు.

అశ్విన్ టెస్టు క్రికెట్‌లో 106 మ్యాచ్‌లు ఆడి 537 వికెట్లు తీశాడు. అతను తన పేరిట 37 ఐదు వికెట్లు సాధించాడు. మ్యాచ్‌లో 8 సార్లు 10 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ వన్డేల్లో 156 వికెట్లు కూడా తీశాడు. టీ20లో అశ్విన్ 72 వికెట్లు తీశాడు. అతను తన అంతర్జాతీయ కెరీర్‌లో 765 వికెట్లు సాధించాడు. బ్యాట్స్‌మెన్‌గానూ అశ్విన్ తనదైన ముద్ర వేశాడు. టెస్ట్ క్రికెట్‌లో 3503 పరుగులు చేశాడు. అతను మొత్తం 6 టెస్ట్ సెంచరీలు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మొత్తం 8 సెంచరీలు చేశాడు. కాగా,గబ్బా టెస్ట్ డ్రాగా ముగిసిన విష‌యం తెలిసిందే.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది