Copper Water | నీటిని తాగడం ఎంత ముఖ్యమో… దానిని ఏ పాత్రలో తాగాలో కూడా అంతే ముఖ్యం!
Copper Water | డీహైడ్రేషన్ (నీటి కొరత) ఉన్నవారు తప్పకుండా ఎక్కువగా నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తారు. అయితే, నీళ్లు తాగడమే కాదు… వాటిని ఏ పాత్రలో, ఏ కాలంలో తాగుతున్నామన్నది కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
#image_title
వేసవికాలంలో – మట్టి కుండ నీళ్లు
వేసవిలో అధిక వేడి నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే శీతలత అవసరం. చాలామంది ఫ్రిజ్ నీటిని తాగుతారు కానీ ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. బదులుగా మట్టి కుండలో నిల్వ పెట్టిన నీరు సహజంగా చల్లగా ఉంటుంది. ఉదయం గోరువెచ్చని మట్టి కుండ నీళ్లు తాగడం శరీర డిటాక్స్‌కు సహాయపడుతుంది.
శీతాకాలంలో – బంగారు లేదా లోహ పాత్రలు
చల్లని సీజన్‌లో శరీరానికి వెచ్చదనం, రోగనిరోధక శక్తి అవసరం. ఈ సమయంలో బంగారు పాత్రలో నీళ్లు తాగడం శరీరానికి శక్తిని, ఉత్తేజాన్ని ఇస్తుంది. లభ్యం కాకపోతే స్టీల్ లేదా తామ్రపాత్రలు కూడా మంచి ఎంపిక. నిరాశ, నిద్రలేమి తగ్గించడంలో సహాయపడుతుంది.దగ్గు, జలుబు వంటి సీజనల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.
వర్షాకాలంలో – రాగి పాత్ర నీళ్లు
వర్షాకాలంలో వాతావరణంలో బాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో రాగి పాత్రలో నీరు తాగడం వలన శరీరంలోని హానికరమైన బాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. రాగి నీటికి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. క్యాన్సర్, ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించి, సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.