Bank Holidays : బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్.. ఈ రోజుల్లో బ్యాంక్ సేవలు బంద్..
Bank Holidays : బ్యాంక్ సేవలు పొందేవారు జూలై నెలలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో ముందుగా తెలుసుకుంటే ఇబ్బంది ఉండదు. జూలై నెలలో బ్యాంకులు దాదాపు 14 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఆర్‌బీఐ ప్రకారం బ్యాంకులకు సాధారణంగా 8 రోజులు సెలవులు ఉన్నాయి. అలాగే వీకెండ్స్ కలుపుకొంటే మొత్తంగా 14 రోజుల వరకు బ్యాంకులకు సెలవులు లభిస్తున్నాయి. అయితే బ్యాంక్ హాలిడేస్ అనేవి రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉంటాయని గుర్తించుకోవాలి. ఒక రాష్ట్రంలో బ్యాంక్ సెలవు ఉంటే మరో రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు ఉండకపోవచ్చు.
Bank Holidays : తెలుగు రాష్ట్రాల్లో..
అయితే ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో అంతగా సెలవులు ఏమీ లేనట్లుగా తెలుస్తోంది. ఆదివారాలు, శనివారాలు మినహాయిస్తే.. బ్యాంకులకు పెద్దగా సెలవులు ఏమీ లేవు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూస్తే బక్రీద్ శనివారం లేదా ఆదివారం ఉంటుంది. ఈ రోజు ఎలాగూ బ్యాంక్ హాలిడే ఉండనే ఉంది. ఇక తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా జూలై 24 లేదా 25న బ్యాంక్ సెలవు ఉండే అవకాశం ఉంది.బ్యాంకులకు జూలైలో మొత్తం 7 సెలవులు వచ్చాయి.

Bank Holidays on July Month
అయితే దేశవ్యాప్తంగా చూస్తే జూలైలో బ్యాంకులకు 14 సెలవులు వచ్చాయి. జూలై 1న రథయాత్ర, జూలై 7న ఖర్చి పూజ, జూలై 9న ఈద్ ఉల్ అధా, జూలై 11న ఈద్ ఉల్ అఝా, జూలై 13న భాను జయంతి, జూలై 14న బేహ్ దీఖ్లాం, జూలై 16న హరేలా, జూలై 26న కేర్ పూజ సందర్భంగా వేర్వేరు రాష్ట్రాల్లో సెలవులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఈ సెలవులేవీ తెలుగు రాష్ట్రాలకు వర్తించవని గుర్తుంచుకోవాలి.
Bank Holidays: వీకెండ్ హాలిడేస్ ఇవే..
03 జూలై 2022: ఆదివారం
10 జూలై 2022: ఆదివారం
17 జూలై 2022: ఆదివారం
23 జూలై 2022: నాలుగో శనివారం
24 జూలై 2022: ఆదివారం
31 జూలై 2022: ఆదివారం
అలాగే ఇక బ్యాంకులకు సెలవులు ఉన్న రోజుల్లో ఖాతాదారులు యూపీఐ, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు జరపొచ్చు. ఈ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండనున్నాయి.