Insomnia : రాత్రిపూట అస్సలు నిద్ర పట్టడం లేదా? ఇలా చేసి చూడండి.. మీరు వద్దన్నా నిద్ర ముంచుకొస్తుంది..!
Insomnia : చాలామందికి రాత్రి పూట అస్సలు నిద్రపట్టదు. ఏం చేసినా నిద్రపట్టదు. రాత్రిళ్లు నిద్ర పోకుండా.. కళ్లు తెరిచే ఉంటారు. ఎంత ట్రై చేసినా.. అటు బొర్లినా.. ఇటు బొర్లినా నిద్ర మాత్రం పట్టదు. వాళ్లకు నిద్ర పట్టడం కోసం ఏం చేయాలో పాలుపోదు. నిద్ర పట్టక తెల్లారాక అస్సలు యాక్టివ్ గా ఉండరు. పిచ్చి లేస్తుంది. సరిగ్గా నిద్ర లేక.. తలనొప్పి లేవడం, ఏ పనీ సరిగ్గా చేయలేకపోవడం లాంటివి వేధిస్తుంటాయి. చివరకు నిద్ర రాక.. కొందరు స్లీపింగ్ టాబ్లెట్లకు కూడా అలవాటు పడుతుంటారు.

bay leaves health benefits telugu for insomnia
కొందరికైతే రాత్రి పూట ఇలా పడుకోగానే నిద్ర పడుతుంది. మధ్యలో మెళకువ కూడా రాదు. కొందరికి మంచిగా నిద్ర పట్టడం, కొందరికి పట్టక పోవడం.. అసలు ఏంటి ఈ సమస్య. రాత్రి పూట హాయిగా నిద్ర పోవాలంటే ఏం చేయాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

bay leaves health benefits telugu for insomnia
Insomnia : బిర్యానీ ఆకును ఇలా చేయండి.. హాయిగా నిద్రపోండి
మీకు బిర్యానీ ఆకు తెలుసు కదా. దాన్నే మనం భగారలోనూ వేసుకుంటాం. దాన్ని కొన్ని ప్రాంతాల్లో తేజ్ పత్తా అని కూడా అంటారు. పేరు ఏదైనా.. ఆ ఆకు లేకుండా.. భగారా కానీ.. బిర్యానీ కానీ వండం. అది ఉంటేనే టేస్ట్. దాన్ని ఇంగ్లీష్ లో bay leaves అని పిలుస్తారు. ఈ ఆకును తీసుకోవడం వల్ల.. గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. అలాగే అల్సర్ లాంటి సమస్యలు కూడా రావు. ఈ ఆకుకు ఆయుర్వేదంలో మంచి ప్లేస్ ఉంది. అందుకే దీన్ని తరుచూ వంటకాల్లో వాడుతుంటాం.

bay leaves health benefits telugu for insomnia
అయితే.. హాయిగా నిద్ర పట్టాలన్నా కూడా బిర్యానీ ఆకు బాగా ఉపయోగపడుతుంది. బిర్యానీ ఆకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. వాటిని నీటిలో కలిపి.. రాత్రి పూట తాగితే హాయిగా నిద్రపడుతుంది. లేదంటే.. బిర్యానీ ఆకును.. కాల్చి.. దాని వాసనను పీల్చాలి. మీరు పడుకునే గది తలుపులు మూసేసి.. ఆకును కాల్చి.. ఆ వాసనను పీల్చితే.. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీంతో ఆందోళన, ఒత్తిడి మాయం అవుతాయి. ఆ తర్వాత మెల్లగా నిద్ర పడుతుంది. అందుకే.. నిద్ర పట్టని వాళ్లు ఈ ఒక్క పని చేసి.. హాయిగా నిద్రపోండి.ఇది కూడా చదవండి ==> జూన్ 7 నుంచి ఆనందయ్య మందు పంపిణీ.. ఈ వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఇది కూడా చదవండి ==> ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు.. ఔషధాల గని ఈ మొక్క.. దీని వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ఇది కూడా చదవండి ==> క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. వెంటనే జ్యూస్ చేసుకొని తాగేస్తారు..!
ఇది కూడా చదవండి ==> ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి.. నేల ఉసిరి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ఇది కూడా చదవండి ==> ఈ కాయలు కనిపిస్తే అస్సలు వదలకండి.. వీటి గురించి తెలిసి డాక్టర్లే నోరెళ్లబెట్టారు?