TDP : ఇదెక్కడి బుద్ది లేని రాజకీయం బుద్ధ వెంకన్న | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP : ఇదెక్కడి బుద్ది లేని రాజకీయం బుద్ధ వెంకన్న

 Authored By prabhas | The Telugu News | Updated on :22 April 2022,7:00 am

TDP : రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. వచ్చే ఎన్నికల్లో కనీసం ప్రస్తుతం ఉన్న సీట్లు కూడా రావని ఆ పార్టీ నాయకులకు అర్థమైందేమో.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కి పరిమితం పోతున్నామని ముందుగానే భావించారేమో.. అందుకే తెలుగు దేశం పార్టీ తమ్ముళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరం గా ఉన్నాయి అంటూ వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు హంగామా చేశారు.

జిల్లా కేంద్రాల్లో చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జోలికి వస్తే చంపేస్తామని హెచ్చరించారు. చంద్రబాబుపై గాని ఆయన కుటుంబంపై పిచ్చి వేషాలు వేసే బ్యాచ్‌ కి కఠిన శిక్ష తప్పదు అంటూ హెచ్చరించారు. అనవసరంగా నోరు పారేసుకుని చంద్రబాబు నాయుడు గారి పై విమర్శలు చేసే వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని బుద్ధ వెంకన్న అన్నాడు.

Buddha Venkanna over action chandrababu birthday event

Buddha Venkanna over action chandrababu birthday event

చంద్రబాబు నాయుడు కోసం చంపడానికి చావడానికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నాడు. ఇందు కోసం వంద మంది సూసైడ్ బ్యాచ్ ను కూడా సిద్ధం చేశామని ఆయన ప్రకటించాడు. బుద్ధ వెంకన్న చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం లేపుతున్నాయి. స్వయంగా తెలుగు దేశం పార్టీలోనే ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు మంచిది కాదని, విమర్శలు చేసినంత మాత్రాన హత్యలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై చంద్రబాబు నాయుడు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది