Business Idea : కిలో 5కే టమాటా తో ఇలా చేస్తే నెలకి 50 వేల రూపాయల లాభం…. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Idea : కిలో 5కే టమాటా తో ఇలా చేస్తే నెలకి 50 వేల రూపాయల లాభం….

 Authored By aruna | The Telugu News | Updated on :14 August 2022,7:30 am

Business Idea : చాలామంది ఏదో ఒక బిజినెస్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ వారికి ఎలాంటి బిజినెస్ చేయాలో అసలు అర్థం కాదు. అలాంటి వారికి టమాట తో ఒక బిజినెస్ ఐడియాను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇప్పుడున్న సీజన్లో టమోటా రేట్లు అనేవి పూర్తిగా పడిపోయాయి. వాటిని పండించిన రైతులు సరియైన ధర లేనందున వాటిని అలా వదిలేస్తూ ఉంటారు. ఒక్కొక్క చోట తక్కువ రేట్ కి ఇస్తూ ఉంటారు. ఈ టమోటా కు సంవత్సరంలో ఒక ఆరు నెలలు బాగా మండిపోతూ ఉంటుంది. మరొక ఆరు నెలల్లో టమాటా ధర దిగివస్తుంది. ఇటువంటి టమాటా మనం ప్రతినిత్యం చేసుకునే వంటకాలలో ఏదో ఒక రూపంలో దీనిని వాడుతూనే ఉంటాము. అదేవిధంగా ప్రస్తుతం బయట చేసే ఫాస్ట్ ఫుడ్ లలో ఈ టమాటా సాస్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అటువంటి సాసులకు ఎక్కువగా డిమాండ్ నడుస్తుంది. ఫాస్ట్ ఫుడ్ లలో ఈ యొక్క సాస్ చేర్చడం వల్ల అద్భుతమైన రుచి ఉంటుంది.

అయితే ఈ టమాటాకు ధర తక్కువగా ఉన్నప్పుడు ఈ టమాటాలను సేకరించుకొని వీటితో కొన్ని రకాల సాసులను రెడీ చేసి అమ్మినట్లయితే మంచి లాభాలను పొందవచ్చు. ఈ విధంగా ఇంట్లోనే ఈ బిజినెస్ తక్కువ పెట్టుబడితో లక్షలలో లాభాలను పొందవచ్చు. అయితే ఈ టమాటా సాస్ తయారీ విధానం కోసం పెట్టుబడి 7.82 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీనిలో 1.95 లక్షలు పెట్టుబడి పెట్టాలి. మిగిలిన డబ్బులను ముద్ర లోన్ ద్వారా ప్రభుత్వము నుండి లోన్ తీసుకోవచ్చు. ఈ తయారీ విధానానికి యూనిట్ కి అవసరపడే కొన్ని మిషన్స్ వాటికి రెండు లక్షల వరకు అవుతుంది. అదేవిధంగా ముడిసరుకు వర్కర్లకు శాలరీలు, అద్దె, ప్యాకింగ్ లాంటివి వాటికి 5. 82 లక్షలు ఖర్చు అవుతుంది. అయితే ఈ టమోటా సాస్ తయారీకి పెద్దగా స్థలం కూడా అవసరం ఉండదు. చిన్న స్థలంలోనే ఈ టమాటా సాస్ తయారు చేయవచ్చు.

Business Idea With Tomatoes Get Rs 50K Profit

Business Idea With Tomatoes Get Rs 50K Profit

అయితే దీని తయారీ విధానం చూద్దాం.. ముందుగా ఎర్రని టమాటాలను ముక్కలుగా చేసుకోవాలి వాటిని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిపై కేటింగ్ లో ఉడికించుకోవాలి తరువాత గుజ్జు నుండి విత్తనాలు, తొక్కను వేరు చేయాలి. ఈ గుజ్జుకు వెల్లుల్లి, లవంగాలు, ఉప్పు, పంచదార, వెనిగర్, ఎండుమిర్చి, అల్లం, కలిపి నిల్వ ఉంచాలి. అయితే దీనిలో ప్రిజర్వేటివ్ ను మిక్స్ చేస్తారు. అంతే సాస్ తయారవుతుంది. ముద్ర లోన్ ప్రకారం 7.82 లక్షల పెట్టుబడితో తయారుచేసిన ఈ టమోటా సాస్ సంవత్సరానికి ఆదాయం 28.80 లక్షలు.. దీనిలో ఒక సంవత్సరంలో 22.80 లక్షలను పెట్టుబడికి తీసివేస్తే ఇక మిగిలిన ఆరు లక్షలు మీకు లాభం అన్నమాట.. అంటే ప్రతి నెలలో మీకు లాభం 50 వేల రూపాయలు వస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది