YS Viveka Murder Case : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆఖరి నిమిషంలో ఊహించని ట్విస్ట్..!
YS Viveka Murder Case : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజురోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం వివేకా కేసును సీబీఐ హ్యాండిల్ చేస్తోంది. ఇప్పటికే పలువురు నిందితులను సీబీఐ విచారించింది. అయితే.. ఆయన హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి వచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ ఏకంగా సుప్రీం తలుపు తట్టింది. తాజాగా సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఎందుకంటే.. ఇప్పటికే వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి బెయిల్ పై బయటికి వచ్చాడు. ఇంకా బయటే ఉన్నాడు. అతడి బెయిల్ రద్దుపై ఏపీ హైకోర్టులోనూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసినా హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టేసింది.
మార్చి 16న కోర్టు ఆ కేసును కొట్టేయడంతో తాజాగా గంగిరెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించిన పిటిషన్ ను సీబీఐ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఈ కేసును ఏపీలో విచారించొద్దని.. వేరే రాష్ట్రంలో ఈ కేసును విచారించాలంటూ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి కూడా సుప్రీంలో పిటిషన్ ను వేశారు. సునీత పిటిషన్ పై ఇంకా కోర్టు తీర్పు రాలేదు. ఈ నెల చివర్లో కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది. వేరే రాష్ట్రంలో ఈ కేసును దర్యాప్తు చేయాలని అడగడానికి కారణం.. హత్య జరిగి మూడు ఏళ్లు అయినా ఇప్పటి వరకు ఆ కేసుపై ఎటూ తేల్చకపోవడంతో సునీత అసంతృప్తిని వ్యక్తం చేసింది.
YS Viveka Murder Case : వివేకా కేసుపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల వార్
అలాగే.. ఈ కేసు రాజకీయంగానూ పలు మలుపులు తిరిగింది. టీడీపీ, వైసీపీ మధ్య కూడా మాటల యుద్ధం రోజురోజుకూ పెరుగుతోంది. ఎందుకంటే.. టీడీపీ పార్టీకి చెందిన పులివెందుల ఇన్ చార్జ్ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిపై వైసీపీ పార్టీ వివేకా హత్య కేసుపై ఆరోపణలు చేస్తుండటంతో కడప జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే.. వివేకా హత్య కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఈ ఇద్దరు నాయకులు ఇప్పటికే ఖండించిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐ విచారించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. మొత్తానికి సీబీఐ ఆధ్వర్యంలో ఇప్పుడిప్పుడే వైఎస్ వివేకా కేసు కాస్త ముందుకెళ్తోంది.