YS Viveka Murder Case : వివేకా కేసులో నిజాలు బయటకి లాగిన ది వైర్ – వీటికి సిబిఐలో ఒక్కరైనా సమాధానం చెప్పగలరా?

Advertisement

YS Viveka Murder Case : ప్రస్తుతం ఏపీలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చర్చనీయాంశం అయింది. జగన్ ముఖ్యమంత్రి కాకముందు నుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది. ఇప్పటికీ ఈ కేసు ఓ కొలిక్కి రాలేదు. ఈ మధ్య ఆ కేసు పలు మలుపులు తిరుగుతోంది. చివరకు జాతీయ మీడియా అటెన్షన్ కూడా ఆ కేసు వైపు మళ్లింది. దీంతో దేశమంతా ఈ కేసు గురించి చర్చిస్తున్నారు. ఇప్పుడు సీబీఐ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సూద్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఈ కేసును టేకప్ చేసిన తర్వాతే ఈ కేసు గురించి దేశమంతా తెలిసింది.

Advertisement

అయితే.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు ఆయన హత్య కేసు ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు. దానికి కారణాలు అనేకం అంటూ ఏకంగా నేషనల్ మీడియా ది వైర్ ఒక కథనాన్ని రాసింది. దీంతో ఈ కేసు విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. హత్య జరిగి ఇప్పటికే నాలుగేళ్లు దాటింది. కానీ.. ఇప్పటి వరకు సీబీఐ ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు అంటూ ది వైర్ కథనాన్ని వండి వార్చింది.అసలు దర్యాప్తును ఒకే కోణంలో చూసి కొనసాగించారు. ఆయన హత్యకు మరేదైనా కారణమా అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. అసలు ఆ దిశగా ఎందుకు సీబీఐ దర్యాప్తు చేయడం లేదు. కేవలం ఒక వ్యక్తినే పట్టుకొని ఆయన్నే లక్ష్యంగా చేసుకొని ఆయన్నే దోషిగా రుజువు చేయడం కోసం సీబీఐ నాలుగేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎంపీ అవినాష్ రెడ్డి మీదనే సీబీఐ ఫోకస్ మొత్తం పెట్టిందని..

Advertisement
who is behind YS Viveka Murder Case revealed by cbi
who is behind YS Viveka Murder Case revealed by cbi

YS Viveka Murder Case : దర్యాప్తు మొత్తం ఒకే కోణంలో సాగింది

అసలు వివేకా హత్య కేసుకు, అవినాష్ రెడ్డికి సంబంధం ఉందా.. లేదా అనే కోణంలో మాత్రం సీబీఐ అడుగు వేయలేదు. కడప లోక్ సభ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి ఖరారు అయిన తర్వాతనే వివేకా హత్య జరిగింది. ఆ సీటు కోసమే నిందితులు వివేకాను చంపారు అనే కోణంలో సీబీఐ వాదించడంలో ఎలాంటి లాజిక్ లేదని స్పష్టం చేసింది. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ ఆయన దగ్గర్నుంచి ఈ హత్యకు సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా కోర్టుకు సమర్పించలేకపోయింది. ఇలా.. పలు విషయాల్లో సీబీఐ ఎలాంటి ఆధారాలను సేకరించకుండా ఒకవైపు నుంచే దర్యాప్తు చేసిందని విశ్లేషణాత్మకంగా కథనాన్ని వండి వార్చింది.

Advertisement
Advertisement