Ap – Telangana : ఏపీ, తెలంగాణ మధ్య.. కేంద్రం కొత్త చిచ్చు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ap – Telangana : ఏపీ, తెలంగాణ మధ్య.. కేంద్రం కొత్త చిచ్చు..!

Ap – Telangana : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కొన్ని విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించలేదు. వాటిని అలా ఉంచి కొత్త పేచీ పెట్టడానికి మోడీ సర్కారు రెడీ అవుతోందా?, దానికి తెలంగాణ రాష్ట్రం తొందరపడి తలూపిందా? అంటే అవును అనే సమాధానాలే వస్తున్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల పంచాయతీని తీర్చటానికి ముఖ్యంగా కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించటానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ఎనిమిది […]

 Authored By kondalrao | The Telugu News | Updated on :12 June 2021,6:15 pm

Ap – Telangana : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కొన్ని విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించలేదు. వాటిని అలా ఉంచి కొత్త పేచీ పెట్టడానికి మోడీ సర్కారు రెడీ అవుతోందా?, దానికి తెలంగాణ రాష్ట్రం తొందరపడి తలూపిందా? అంటే అవును అనే సమాధానాలే వస్తున్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల పంచాయతీని తీర్చటానికి ముఖ్యంగా కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించటానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ఎనిమిది నెలల కిందట ఒక ప్రతిపాదన చేశారు. ఈ గొడవకు సంబంధించి తెలంగాణ సర్కారు గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ని ఉపసంహరించుకోవాలని సూచించారు. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంల సమక్షంలో ఈ ప్రపోజల్ పెట్టారు. దానికి రాష్ట్ర కృష్ణా ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచీ సానుకూలంగానే ఉన్నారు. కానీ ఈ ఇష్యూలో తెలంగాణ కొంత వెనకడుగు వేసిందని కొందరు అంటున్నారు.

central Govt create new problems between ap telangana

central Govt create new problems between ap telangana

అది ఎంత వరకు నిజం?..

తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో వేసిన కేసు ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని తొలగించటంలో ఆటంకంగా మారిందన్న కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాన్ని దృష్టిలో పెట్టుకొనే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మోడీ ప్రభుత్వం ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయకపోతే మళ్లీ న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అలాంటప్పుడు మెట్టు దిగిందని ఎలా అనగలం?. కాకపోతే ఈ వంకతో సెంట్రల్ గవర్నమెంట్ ఏపీ, తెలంగాణ నిర్మిస్తున్న అన్ని సాగు, తాగు నీటి ప్రాజెక్టుల వివరాలను తన దగ్గరికి తెప్పించుకుందని, వాటిని అడ్డం పెట్టుకొని ఫ్యూచర్ లో ఇరు రాష్ట్రాల మధ్య పొలిటికల్ పంచాయతీ పెట్టే ఛాన్స్ ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

కేంద్రం ఎప్పుడూ చేయలేదు..: Ap – Telangana

Modi

Modi

గతంలో ఏ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తలెత్తినా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ పరిష్కరించలేదని, ట్రిబ్యునళ్ల ద్వారానే ఒక కొలిక్కి వచ్చేవని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడైనా కొత్త ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేస్తారా? లేక కేంద్ర మంత్రే చిక్కుముడిని విప్పుతారా అనేది చూడాలి. గోదావరి, కావేరి నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కృష్ణా ఇష్యూని వాడుకుంటుందా అనే డౌటు కూడా కొంత మందికి వస్తోంది. ఏదేమైనప్పటికీ మోడీ ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుందో గమనించకుండానే తొందరపడి ఒక అంచనాకు రావటం సరికాదనిపిస్తోంది. ఏదో ఒక విధంగా ప్రతిష్టంభన వీడితే దక్షిణ తెలంగాణకు సాగునీటి విషయంలో తగిన న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు తాపత్రయపడుతోంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> vivek : గడ్డం వివేక్ పరిస్థితి.. అడ్డం తిరిగిందా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> TTD CHAIRMAN : వైవీకి ప్ర‌మోష‌న్‌.. టీటీడీ కొత్త చెర్మన్ గా ఎవరు…?

ఇది కూడా చ‌ద‌వండి ==> Ys Jagan : ఆ జిల్లా 10 మంది ఎమ్మెల్యేలపై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్‌..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Ys Jagan : ఎమ్మెల్సీలుగా ఈ నలుగురిని ఫైన‌ల్ చేసిన వైఎస్ జగన్..!

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది