vivek : గడ్డం వివేక్ పరిస్థితి.. అడ్డం తిరిగిందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

vivek : గడ్డం వివేక్ పరిస్థితి.. అడ్డం తిరిగిందా..?

 Authored By kondalrao | The Telugu News | Updated on :12 June 2021,10:56 am

vivek : టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ 2019 లోక్ సభ ఎన్నికల్లో తనకు పెద్దపల్లి నియోజకవర్గ ఎంపీ టికెట్ ఇవ్వలేదనే కోపంతో బీజేపీలో చేరిన మాజీ ఎంపీ గడ్డం వివేక్ vivek పరిస్థితి ఇప్పుడు అడ్డం తిరిగింది. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలతో సన్నిహితంగా మెలుగుతారు. పై స్థాయిలో మంచి సంబంధాలనే మెయింటెయిన్ చేస్తారు. కానీ క్షేత్ర స్థాయికి వచ్చేసరికి దానికి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంటుంది. పొలిటికల్ పార్టీ అన్న తర్వాత నాయకులు ఎంత ముఖ్యమో కార్యకర్తలు కూడా అంతే ముఖ్యం. కానీ వివేక్ ఈ సంగతిని గమనించినట్లు లేడు. పునాదులు సరిగా లేకుండానే పెద్ద పెద్ద భవంతులు కట్టాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఫలితంగా ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది. అందుకేనేమో బహుశా ఆయన ఏ రాజకీయ పార్టీలోనూ కుదురుగా ఉండలేకపోతున్నారు.

కలుపుకుపోడు..

no change in vivek political

no change in vivek political

వివేక్ vivek తో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా తనకంటూ ఒక స్పెషల్ గ్రూప్ క్రియేట్ చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. స్థానిక నేతలను కలుపుకుపోడు. దీంతో వాళ్లంతా ఏకమై ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తారు. గతంలో టీఆర్ఎస్ లో ఉన్నా, ప్రస్తుతం కమలం పార్టీలో ఉన్నా ఇదే పరిస్థితి. అందుకే వివేక్ కి పాలిటిక్స్ కలిసి రావట్లేదని అంటుంటారు. మనం పైనుంచి వచ్చినంత మాత్రాన గొప్ప కాదని, కింది స్థాయి కేడర్ ని కూడా పరిగణనలోకి తీసుకుపోవాలని హితవు పలుకుతున్నారు.

అప్పుడే కంప్లైంట్..: vivek

వివేక్ కాషాయం పార్టీలో చేరి పట్టుమని రెండేళ్లు కూడా అయిందో లేదో అప్పుడే ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వివేక్ వన్ మ్యాన్ ఆర్మీలా ఫీలవుతున్నాడని, ఒంటెత్తు పోకడలు పోతున్నాడని పెద్దపల్లి బీజేపీ లీడర్లు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులూ ఇదే మాట చెబుతున్నారు. ఈ మేరకు వాళ్లు రీసెంట్ గా మీటింగ్ పెట్టుకొని వివేక్ వ్యవహార శైలిపై చర్చించి హైకమాండ్ కి తెలియజేయాలని తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గడ్డం వివేక్ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లోకి రెండు సార్ల చొప్పున వెళ్లొచ్చిన ఆయన ఇప్పుడు ఏ పార్టీలోకి పోతారో ఎవరికీ అర్థంకావట్లేదు. బాగుపడే జాతకం లేకపోతే ఇంతే. ఏ పార్టీలో చేరినా ఒరిగేది శూన్యం. రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్.

ఇది కూడా చ‌ద‌వండి ==> నాగదోషం అంటే ఏమిటి.. నాగదోషం ఎవరికి… దోష నివారణ ఎలా చేసుకోవాలి..?

ఇది కూడా చ‌ద‌వండి ==> Vishnu priya : బెల్లీ డాన్స్‌తో అదరగొటిన విష్ణు ప్రియ.. వైర‌ల్ వీడియో

ఇది కూడా చ‌ద‌వండి ==> 1000 ఏళ్ల నాటి కోడిగుడ్డు మీరు ఎప్పుడైనా చూశారా.. ఇదిగో…!

ఇది కూడా చ‌ద‌వండి ==> Magnet Man Video : కరోనా టీకా తీసుకున్నాకా… అయస్కాంతంలా మారిన అత‌ని శ‌రీరం..!

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది