7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ .. 18 నెలల డీఏ బకాయలు ఒకేసారి అకౌంట్లోకి.. ఎంత వేయనున్నారో తెలుసా?
7Th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరోసారి తీపి కబురు చెప్పింది. ఇప్పటికే డీఏను పెంచిన విషయం తెలిసిందే. సెవెన్త్ పే కమిషన్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల డీఏ బకాయిలను ఒకేసారి అందజేయనుంది.నిజానికి గత సంవత్సరం నుంచి పెరిగిన డీఏ బకాయిలను చెల్లిస్తాం అని కేంద్రం చెబుతూనే ఉంటోంది. తాజాగా ఆ బకాయిలను ఒకేసారి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తోంది. ఆ లెక్క ప్రకారం.. 18 నెలలుగా పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలు 2 లక్షల రూపాయలను ఒకేసారి జమ చేయనున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు మార్చి 16న అంటే బుధవారం కేంద్ర కేబినేట్ భేటీ కానుంది. డీఏ పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. సెవెన్త్ పే కమిషన్ సిఫారసుల మేరకు డీఏ పెంపుపై కేబినేట్ చర్చించనుంది. త్వరలో రాబోయే హోలీ పండుగ సందర్భంగా కేంద్రం.. ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పనుంది.ఈ మీటింగ్ లో డీఏ పెంపుతో పాటు.. 2 లక్షల డీఏ బకాయిలను ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలో వేసేలా నిర్ణయం తీసుకోనున్నారు.
7Th Pay Commission : మార్చి 16న కేబినేట్ భేటీ అయ్యే అవకాశం
ఈ లెక్క ప్రకారం.. డీఏ బకాయిలు.. లేవల్ వన్ ఉద్యోగులకు రూ.11,880 నుంచి రూ.37,554 వరకు పెరగనున్నాయి. అదే లేవల్ 13 ఉద్యోగులకు 1,23,100 రూపాయల నుంచి రూ.2,15,900 వరకు పెరగనుంది. లేవల్ 14 పే స్కేల్ ఉద్యోగులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 వరకు పెరగనుంది. ఈ పెంపు వల్ల.. దేశ వ్యాప్తంగా ఉన్న 48 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 60 లక్షల పింఛనుదారులకు లబ్ది చేకూరనుంది.