Ration Card : తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త… 5 లక్షల రుణం…!
ప్రధానాంశాలు:
Ration Card : తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త... 5 లక్షల రుణం...!
Ration Card : కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పేద మరియు మధ్య తరగతి వర్గాలకు మేలు చేసే విధంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగానే ప్రతి ప్రాజెక్టుకు అవసరమైన రుణం , అలాగే వెనుకబడిన కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు కూడా ఇవ్వబడుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజలు పొందుతున్న ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో అనగా జూలై 13 వ తేదీన మోడీ క్యాబినెట్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మూడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్లో పేద ప్రజలకు ,మధ్య తరగతి వారికి అంచనాలు ఎక్కువగా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేశం లేదు. ఇదే సమయంలో ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ యోజన గురించి తెలుసుకోవాలి.
ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ యోజన లబ్ధిదారుల సంఖ్య మరియు పథకం యొక్క బీమా మొత్తం కూడా జులై 13న విడుదల చేసే బడ్జెట్ సమర్పించేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈసారి దానిని విస్తరించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ముఖ్యంగా బిపిఎల్ రేషన్ కార్డు కోసం, ఆరోగ్య సంబంధిత పథకాన్ని మరింత విస్తరింప చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విధంగా చేయడం పేద మరియు మధ్య తరగతి వారికి లభదాయకంగా మారవచ్చు. తద్వారా పేదల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు కొన్నేళ్లపాటు చెప్పుకోదగ్గ విషయాలుగా మిగిలిపోతాయి .
తద్వారా తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉన్నవారు ఆయుష్మాన్ భారత్ యోజన పథకం కింద ఏడాదికి 5 లక్షల వరకు పొందవచ్చు. అంటే ఈ పథకం ద్వారా సక్రియంగా ఉన్న ఆస్పత్రులలో ఉచితంగా వైద్య చికిత్స పొందవచ్చు. అయితే ఈసారి ఆయుష్మాన్ భారత్ యోజన పథకానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 5 నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇదే జరిగితే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారికిి ఇది బంపర్ న్యూస్ అని చెప్పవచ్చు.