Jan dhan Yojana Scheme : మధ్య తరగతి వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త… ఈ అకౌంట్ తో 2.30 లక్షలు పొందండిలా…!
Jan dhan Yojana Scheme : 2014లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ప్రజలకు వారి సామాజిక మరియు ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఆర్థిక సేవలను అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఇక ఈ పథకం ద్వారా అన్ని కుటుంబాలకు బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ తో సహా పలు రకాల సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగానే జీరో బ్యాలెన్స్ తో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. అంటే బ్యాంక్ ఎకౌంట్ తీసుకునేటప్పుడు మీరు మనీ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట.
అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ జన్ ధన్ అకౌంటు మీరు క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం రూ.2.30 లక్షల వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది . అదెలా అంటే జన్ ధన్ ఎకౌంటు తీసుకున్న వారికి ఉచితంగా రూపే డెబిట్ కార్డును అందిస్తున్నారు. ఈ కార్డు పై దాదాపు 2 లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది. అలాగే ఈ కార్డు ఉన్నవారికి 30 వేల వరకు భీమా కూడా లభిస్తుంది. అంటే ఈ ఖాతాను కలిగి ఉన్న వారు అకస్మాత్తుగా చనిపోతే వారి కుటుంబానికి ఈ డబ్బులు వస్తాయి. అలాగే ఇది జీరో అకౌంట్ కాబట్టి ఓవర్ డ్రాప్ పరిమితి 10,000 లేకపోయినా మీరు రూ.10,000 విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం ఆర్థిక అక్షరాస్యత పెంచడంతోపాటు పేదరికాన్ని తగ్గించడంలో ఎంతో పురోగతిని సాధిస్తుంది. మరి ఈ జన్ ధన్ ఖాతాను ఎలా ఓపెన్ చేయాలి. ప్రయోజనాలు ఏంటి….వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Jan dhan Yojana Scheme జన్ ధన్ ఎకౌంటు ఎలా తీసుకోవాలి…
మీరు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం యొక్క అకౌంట్ పొందాలి అంటే సమీపంలోని బ్యాంకుకు వెళ్లి వారిని సంప్రదించవచ్చు. లేదా ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ను సంప్రదించవచ్చు. దీనిలో ముందుగా మీరు ఎకౌంటు ఓపెనింగ్ ఫారమ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకు వారు పేర్కొన్న విధంగా అవసరమైన డాక్యుమెంట్స్ ను సమర్పించాల్సి ఉంటుంది.
Jan dhan Yojana Scheme ప్రయోజనాలు..
జన్ ధన్ ఎకౌంటు తీసుకున్నవారు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అకౌంట్ హోల్డర్లు లక్ష రూపాయల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పొందుతారు. ఊహించని ప్రమాదాలలో ఈ పథకం మీకు ఆర్థిక రక్షణను అందిస్తుంది.
మినిమం బాలన్స్…
ఈ అకౌంట్లో మినిమం బాలన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ బ్యాంకు సేవలు అందిస్తున్నారు కాబట్టి మినిమం బాలన్స్ మైంటైన్ చేయాల్సిన అవసరం ఉండదు.