Chandra babu Naidu : వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు పై చంద్రబాబు సెటైరికల్ కామెంట్స్..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Chandra babu Naidu : వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు పై చంద్రబాబు సెటైరికల్ కామెంట్స్..!

Chandra babu Naidu : టీడీపీ TDP అధినేత చంద్రబాబు నాయుడు Chandra babu మరోసారి సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  Ys Jaganపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తన సొంత ఎమ్మెల్యేలను నమ్మడం లేదని, అందుకే వాళ్లను ట్రాన్స్ఫర్ చేస్తున్నారని, అందుకే అంబటి రాయుడు  Ambati Rayuduకూడా వై.యస్.జగన్మోహన్ రెడ్డి తీరుని చూసి పారిపోయాడని ఎద్దేవా చేశారు. ప్రజలు వై.యస్.జగన్మోహన్ రెడ్డిని నమ్మటం లేదు. ఆయన మాత్రం తన సొంత ఎమ్మెల్యేలను కూడా నమ్మటం లేదని, […]

 Authored By aruna | The Telugu News | Updated on :7 January 2024,7:30 pm

ప్రధానాంశాలు:

  •  Chandra babu Naidu : వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు పై చంద్రబాబు సెటైరికల్ కామెంట్స్..!

Chandra babu Naidu : టీడీపీ TDP అధినేత చంద్రబాబు నాయుడు Chandra babu మరోసారి సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  Ys Jaganపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తన సొంత ఎమ్మెల్యేలను నమ్మడం లేదని, అందుకే వాళ్లను ట్రాన్స్ఫర్ చేస్తున్నారని, అందుకే అంబటి రాయుడు  Ambati Rayuduకూడా వై.యస్.జగన్మోహన్ రెడ్డి తీరుని చూసి పారిపోయాడని ఎద్దేవా చేశారు. ప్రజలు వై.యస్.జగన్మోహన్ రెడ్డిని నమ్మటం లేదు. ఆయన మాత్రం తన సొంత ఎమ్మెల్యేలను కూడా నమ్మటం లేదని, అందుకే ఎమ్మెల్యేలంతా పారిపోతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి పోయిందని విమర్శించారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్వన్ గా ఉండాలనేదే తన కోరికని వెల్లడించారు. మహిళలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

నిత్యవసర ధరలు పెరిగిపోయాయి అని చెప్పారు. 9సార్లు కరెంట్ బిల్ పెంచి జనాన్ని బాదుతున్నారని చంద్రబాబు అన్నారు. టమాటాకు పొటాటోకు తేడా తెలియని ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులను మూడు ముక్కలు చేసి సర్వనాశనం చేశారన్నారు. ఆరోజు సైబరాబాద్ డెవలప్ చేయకుంటే ఇప్పుడు హైదరాబాద్ అలా అభివృద్ధి అయ్యేదా అని ప్రశ్నించారు. మనకు రాజధాని లేకుండా ఐదేళ్లు పాలించాడని అన్నారు. తాము అధికారంలోకి రాగానే దేవతల రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. చివరకు చెత్తపై కూడా పన్నువేసే స్థితికి ఈ ప్రభుత్వం దిగజారిందని చంద్రబాబు మండిపడ్డారు.

హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగుజాతి గ్లోబల్ నాయకులుగా ఎదిగేందుకు టీడీపీ ఉపయోగపడిందని ఉన్నారు. మహిళలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిత్యవసర వస్తువులు ధరలు పెరిగిపోయాయని చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తే 32 మండలాలకు నీళ్లు వచ్చేవి కానీ అది పూర్తి చేయలేకపోయారని జగన్ నప చంద్రబాబు విమర్శించారు. 25 సంవత్సరాల క్రితం తాను పిల్లలకి ఇచ్చిన ఆయుధం ఐటి అని తనను అక్రమంగా అరెస్టు చేసినందుకు ప్రపంచమంతా సంఘీభావం తెలిపిందని అన్నారు.

భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో సూపర్ సిక్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు. జయహో బీసీ కింద ప్రత్యేక చట్టం తీసుకొస్తామని వెల్లడించారు.సొంత పార్టీ ఎమ్మెల్యేలను జగన్మోహన్ నమ్మటం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అందరూ సిద్ధం కావాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖను మూసివేసారని ఆరోపించారు. అప్పుల్లో రాష్ట్ర రైతులు అగ్రస్థానంలో ఉన్నారని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని చెప్పారు. రైతే రాజుగా మారాలని పిలుపునిచ్చారు. టీడీపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక