ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు సస్పెన్షన్? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు సస్పెన్షన్?

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదటిరోజే గందరగోళంగా జరిగాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మొదటి రోజే తీవ్రంగా వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఏకంగా స్పీకర్ పోడియం వద్దకు వచ్చి తన నిరసనను వ్యక్తం చేశారు. దీంతో అధికార పార్టీకి ఏం చేయాలో తెలియలేదు. ఏపీలో వచ్చిన తుఫాను వల్ల నష్టపోయిన వారికి పరిహారం విషయంలో జరిగిన చర్చలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రభుత్వాన్ని ఆరోపించారు. దీనిపై వెంటనే […]

 Authored By uday | The Telugu News | Updated on :30 November 2020,2:58 pm

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదటిరోజే గందరగోళంగా జరిగాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మొదటి రోజే తీవ్రంగా వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఏకంగా స్పీకర్ పోడియం వద్దకు వచ్చి తన నిరసనను వ్యక్తం చేశారు. దీంతో అధికార పార్టీకి ఏం చేయాలో తెలియలేదు.

ఏపీలో వచ్చిన తుఫాను వల్ల నష్టపోయిన వారికి పరిహారం విషయంలో జరిగిన చర్చలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రభుత్వాన్ని ఆరోపించారు. దీనిపై వెంటనే సీఎం జగన్ నిమ్మలకు సమాధానం చెప్పారు. తుపాను విషయంపై తాను కూడా మాట్లాడుతానని చంద్రబాబు స్పీకర్ ను కోరారు.

దీంతో చంద్రబాబును మాట్లాడనీయకుండా వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగలడంతో విసిగెత్తిన చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు.

పోడియం ముందు బైఠాయించడం ఏంటి.. అంటూ సీఎం జగన్ కూడా చంద్రబాబును ప్రశ్నించారు. అయినప్పటికీ.. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అలాగే నినాదాలు చేస్తూ ఉండటంతో స్పీకర్ తమ్మినేని చంద్రబాబుతో సహా.. ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. వారిపై సస్పెన్షన్ వేటు సోమవారం మాత్రమే ఉంటుందని స్పీకర్ ప్రకటించారు.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది