ChandraBabu : ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరం నర సమయం కూడా లేదు. అందుకే ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. ఎప్పుడు ఏ పార్టీలో ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారుతోంది. ఈనేపథ్యంలో టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి అధికార వైసీపీని ఓడించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. వాళ్ల పొత్తులు కన్ఫమ్ అయినట్టే. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ కాబట్టి.. బీజేపీకి ప్రత్యర్థి పార్టీగా ఉన్న కాంగ్రెస్.. బీజేపీకి కోపం తెప్పించే పనులు చాలానే చేస్తుంది.
ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే.తాజాగా కాంగ్రెస్ అధినేత నుంచి టీడీపీకి ఆహ్వానం అందిందట. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఏకం చేయడం కోసం కాంగ్రెస్ పలు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే.. టీడీపీకి కూడా ఆహ్వానం అందింది. సోమవారం నాడు శ్రీనగర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను ముగిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ ముగింపు సభలో పాల్గొనాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందిందట. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే టీడీపీతో పాటు 23 పార్టీలకు లేఖ రాశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రేపటితో ముగియనుంది. శ్రీనగర్ లో ముగింపు సభ ఉంటుంది.
ఈ సభకు అందరూ రావాలని 21 పార్టీల చీఫ్ లకు ఖర్గే లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా లేఖ అందిందట. అలాగే.. స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, నితీశ్ కుమార్, అఖిలేష్ యాదవ్, మాయావతి, హేమంత్ సోరెన్ కూడా లేఖ రాసిందట కాంగ్రెస్ పార్టీ. ఈనేపథ్యంలో చంద్రబాబు.. ఆ సభకు వెళ్తారా అనేది సస్పెన్సే. కానీ.. చంద్రబాబు ఈ సభకు వెళ్లకపోవచ్చు.. అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలపడం వల్ల టీడీపీ భారీగా నష్టపోయిందని.. ఇంకోసారి ఆ తప్పు టీడీపీ చేయదని అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.